‘గుత్తా’ నిలబడితే పోటీకి నేను సిద్ధం

I'm ready for the competition - Sakshi

సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి

నల్లగొండ టూటౌన్‌/కనగల్‌: నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే గెలుపు తమదేనని సీఎల్పీ ఉపనేత కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొం డ, కనగల్‌లో గురు వారం ఆయన వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పోటీ చేస్తే తాను పోటీకి సిద్ధమని ప్రకటించారు.

నల్లగొండ ముని సిపాలిటీలో పాలకవర్గం ఉండగా వార్డులకు ప్రత్యేక అధికారులు ఎందుకు నియమించారో అర్థం కావడం లేదన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో అక్కడి ముఖ్య మంత్రి చంద్రబాబు రూ.1,500 కోట్లు అభివృద్ధి కోసం విడుదల చేశారని, ఇక్కడి ప్రభుత్వం రూ.1,500 కోట్లు విడుదల చేసినా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top