మోదీ నుంచే నేర్చుకున్నా

I Have Learned From Modi Says Rahul Gandhi - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని చూసి ఏమేం చేయకూడదో నేర్చుకున్నానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి చాలా విషయాలు గ్రహించినట్లు తెలిపారు. అ ప్పుడు ప్రజలు మోదీకి తిరుగులేని ఆధిక్యం కట్టబెట్టినా ఆయన దేశ హృదయ స్పందనను వినేందుకు నిరాకరించారని విమర్శించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. ‘నిన్న మా అమ్మతో మాట్లాడుతూ 2014 లోక్‌ సభ ఎన్నికల నుంచి చాలా నేర్చుకున్నట్లు చె ప్పాను. గెలిచినా, ఓడినా వినమ్రంగా ఉండా లన్నది ఆ ఎన్నికల నుంచి నేను గ్రహించిన విషయం. భారత్‌ గొప్ప దేశం. ప్రజలు ఏమనుకుం టున్నారన్నదే ఇక్కడ ప్రధానం.

రాజకీయ నా యకుడు ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకుని, వారితో కలసిపోవాలి. నిజాయతీగా చెబుతున్నా.. ఈ విషయంలో ఎలా వ్యవహరించొద్దో మోదీ నాకు నేర్పారు. ఈ దేశ భవితను మార్చే గొప్ప అవకాశాన్ని ప్రజలు మోదీకి కట్టబెట్టా రు. విచారకరమైన విషయం ఏంటంటే దేశ స్పందనను వినేందుకు ఆయన తిరస్కరించా రు. ఆయనలో గర్వం నిండిపోయింది. రాజకీ య నాయకుడికి ఇలాంటి దోరణి ప్రమాదకరం. నాకైతే దేశ ప్రజలే ఉత్తమ గురువులు. 2014 నుంచి నా ప్రయాణం సవ్యంగా సాగు తోంది’ అని రాహుల్‌ అన్నారు. ‘బీజేపీ ముక్త్‌ భారత్‌’ దిశగా కాంగ్రెస్‌ యోచిస్తోందా? అని ప్రశ్నించగా.. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని, దేశం నుంచి ఒకరిని తరిమికొట్టడం కా దని బదిలిచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top