ఆర్థిక మాంద్యం పేరుతో కేసీఆర్‌ ఎత్తుగడ: భట్టి

Guarantees given by the TRS were not implemented once they came to power - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ఆర్థిక మాంద్యం బూచి చూపి ప్రజలను మోసం చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఎత్తుగడ వేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, కేసీఆర్‌ మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం సీఎల్పీ కార్యాల యంలో శాఖల వారీగా ఏర్పాటు చేసిన పార్టీ సబ్‌కమిటీ కనీ్వనర్లతో భట్టి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచి్చన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా చేస్తున్న మోసాన్ని శాఖల వారీగా లోతుగా అధ్యయనం చేయాలని సబ్‌కమిటీల కన్వీనర్లకు సూచించారు. శాఖల వారీగా అప్రమత్తంగా ఉండి అంకెలతో సహా ఆధారాలను సేకరించాలని కోరారు. సమావేశంలో మల్లు రవి, బోరెడ్డి అయోధ్యరెడ్డి, అద్దంకి దయాకర్, కమలాకర్‌ రావు, శ్యామ్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top