జనసేనలోకి మాజీ క్రికెటర్‌ వేణుగోపాలరావు

Former cricketer Venugopal Rao Into Janasena Party - Sakshi

రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ: పవన్‌కల్యాణ్‌  

సాగర్‌నగర్‌ (విశాఖ తూర్పు): జనసేన పార్టీలోకి భారత మాజీ క్రికెటర్‌ వై.వేణుగోపాలరావు చేరారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న పోరాట యాత్ర రెండో రోజు గురువారం విశాఖ, రుషికొండలోని ఓ ప్రైవేటు రిస్సార్ట్స్‌లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. పవన్‌ గురువారం పలువురికి కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.పవన్‌ మాట్లాడుతూ.. 2019లో రాజకీయాల్లో సరికొత్త వ్యవస్థ రాబోతోందని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు.

ఉత్తరాంధ్ర యాస, భాష కళలతో పాటు ఆ ప్రాంత ఆత్మను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ జనసేన అని పేర్కొన్నారు. జూలై 2 నుంచి జనసేన శిక్షణ తరగుతులు ప్రారంభం అవుతాయన్నారు. ప్రతి జిల్లా నుంచి 3 వేల మందిని ఎంపిక చేశామన్నారు. జనసేనలోకి విశాఖకు చెందిన బాలాజీ స్కూల్స్‌ అధినేత మండవ రవికుమార్, టీడీపీ నేత కోన తాతారావు, తణుకుకు చెందిన రామచంద్రరావు, అనకాపల్లికి చెందిన కొణతాల సీతారాం చేరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top