భీమిలిలో టీడీపీకి జెల్ల

Farmer MPP Venkatappa Join in YSRCP Visakhapatnam - Sakshi

వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకటప్పడు,  గ్రంథాలయ మాజీ చైర్మన్‌ మణిశంకర్‌నాయుడు తదితరులు

భీమునిపట్నం: భీమిలిలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేతలంతా గురువారం వైఎస్సార్‌సీపీ లో చేరారు. మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ, పశు గణాభివృద్ధి చైర్మన్‌ గాడు వెంకటప్పడు, జిల్లా గ్రంథాలయ మాజీ  చైర్మన్‌ బంటుపల్లి మణిశంకర్‌నాయుడుతోపాటు ఆనందపురం, భీమిలి మండలాలకు చెందిన పలువురు మాజీ టీడీపీ సర్పంచ్‌లు, ముఖ్య నాయకులు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధి లో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమైన టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరడం గొప్పవిషయమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి లేని పాలన అందిస్తున్నారని, అందుకే పార్టీలో చేరే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా చెబుతారని.. ఇకపై ఇది వైఎస్సార్‌సీపీకి కంచుకోట అన్నారు. పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ, పశుగణాభివృద్ధి చైర్మన్‌ గాడు వెంకటప్పడు, జిల్లా గ్రంథాలయ మాజీ చెర్మన్‌ బంటుపల్లి మణి శంకర్‌నాయుడు మాట్లాడారు.

టీడీపీకి ఊహించని దెబ్బ
భీమిలి నియోజకర్గంలో తెలుగుదేశంపార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. పార్టీ ఆవిర్భావంనాటి నుంచి ఉన్న ముఖ్య నేతలు ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీలోకి చేరడంతో ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో గం టా గెలుపుతో పార్టీ పుంజుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం..ఇక కోలుకునే అవకాశాలు లేకపోవడంతో ముఖ్యనేతలంతా వైఎస్సార్‌సీపీలోకి వస్తున్నారు. మరికొంత మంది ముఖ్యనేతలు కూడా త్వరలోనే పార్టీలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

వైఎస్సార్‌సీపీలో చేరినవారి వివరాలు
మాజీ ఎంపీపీ గాడు వెంకటప్పడు, మాజీ గ్రంథాలయ చైర్మన్‌ బంటుపల్లి మణిశంకర్‌నాయుడు, ఆనందపురం మండల టీడీపీ అధ్యక్షుడు బీ.ఆర్‌.బీ.నాయుడు, మాజీ ఆనందపురం టీడీపీ అధ్యక్షుడు కాకర రమణ, భీమిలి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి గుడాల ఎల్లయ్య, భీమిలి మండల తెలుగు యువత అధ్యక్షుడు గాడు తాతినాయుడు, భీమిలి, ఆనందపురం మాజీ సర్పంచ్‌లు కోరాడ వెంకట సత్యనారాయణ, మజ్జి వెంకటరావు, కె.జోగినాయుడు, కె.వెంకన్న, పల్లంటి రాజేశ్వరి, సియాద్రి శ్రీను, కోట్ల బాలకుమారి, బీసీ కల్లాలు టీడీపీ అధ్యక్షుడు మీసాల రాము, జిల్లా పార్టీ మహిళ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వి. సరోజని, జిల్లా కార్యదర్శి పద్మావతి, మాజీ ఎంపీటీసీలు కాకర లక్ష్మి, కనకల సన్యాసి, మజ్జి అప్పల కొండ, మజ్జివలస మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ లచ్చుబుగత రామారావు, చిట్టివలస ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు కె. పకీర్‌రాజు, ముఖ్య నాయకులు బీ.ఎస్‌.ఎన్‌.నాయుడు (సింగపూర్‌ నాయుడు), నీలాపు సూర్యనారాయణ రెడ్డి, గాడు వెంకటనారాయణ, కనకల వెంకటరమణ,చిల్ల గరుమ్మ ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top