గంభీర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయండి : ఈసీ

Election Commission Directs Delhi Police To File FIR Against Gautam Gambhir - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  బీజేపీ తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.  అనుమతి లేకుండానే గంభీర్‌ ఈస్ట్‌ ఢిల్లీలో ర్యాలీ నిర్వహించడానికి ఈసీ తప్పుపట్టింది. దీంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఏప్రిల్ 26న ఢిల్లీలోని జాంగ్‌పురాలో గంభీర్ ర్యాలీ నిర్వహించాడు. ఈ ర్యాలీకి గంభీర్‌ అనుమతి తీసుకోలేదు. పర్మిషన్‌ తీసుకోకకుండా ర్యాలీ నిర్వహించడం ఎన్నికల నిబంధలను ఉల్లంఘించడమేనని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. 

మరోవైపు.. గంభీర్‌కు రెండు చోట్ల ఓటు హక్కు, రెండు ఓటరు కార్డులు కలిగి ఉన్నాయని, అలా ఉండడం నేరమని, ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీకి గంభీర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఆప్‌ తూర్పు ఢిల్లీ అభ్యర్థి అతిషి డిమాండ్‌ చేశారు. రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా తనకు రాజేంద్రనగర్‌లో ఓటు హక్కు ఉందంటూ గంభీర్‌ తన అఫిడవిట్‌లో డిక్లరేషన్‌ ఇచ్చారని, కానీ రాజేంద్రనగర్‌తోపాటు కరోల్‌బాగ్‌లోనూ గంభీర్‌కు ఓటు హక్కు ఉందని అతిషి ఆరోపించారు. గతంలో బీజేపీ నుంచి తూర్పు ఢిల్లీ లోక్‌ సభ అభ్యర్థిగా మహేశ్‌గిరి పోటీ చేయగా, ఈ సారి ఆయనను తప్పించి గంభీర్‌కు ఆ సీటు కేటాయించారు. ఆప్‌ నుంచి అతిషి, కాంగ్రెస్‌ నుంచి అర్విందర్‌ సింగ్‌ లవ్లీలో బరిలో ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top