త్వరలో కొత్త రాజకీయ కూటమి

CPI form a secular platform  - Sakshi

బీజీపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు

సీపీఐ నేతృత్వంలో విస్తృత, ప్రజాస్వామ్య కూటమి

కూటమిలో మేధావులు, సామాజిక వేత్తలకు భాగస్వామ్యం

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ రెడ్డి

సాక్షి, తిరువనంతపురం : దేశంలో శక్తివంతంగా మారిన భారతీయ జనతాపార్టీ-ఆర్‌ఎస్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు ఒక బలమైన వేదిక అవసరమని సీపీఐ ప్రకటించింది. సారూప‍్యతలున్న పార్టీలతో కలిసి లౌకక ప్రజాస్వామ్య కూటికి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సీపీఐ జనరల్‌ సెక్రెటరీ సురవరం సుధాకర్‌ రెడ్డి ప్రకటించారు. మాకున్న శక్తితో మేం బీజేపీతో పోరాడ లేము.. కాబట్టి భావసారూప్యతలున్న పార్టీలతో ఒక కూటమిగా ఏర్పాడి.. పోరాటం చేయాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. కూటమిపై చర్చలు జరిపేందుకు వచ్చే ఏడాది ఏప్రిల్‌నెల్లో 25 నుంచి29 కేరళలో విస్తృస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

బీజేపీని ధైర్యంగా ఎదుర్కొనే శక్తియుక్తులు ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీకి లేవని.. అందువల్లే మరో విస్తృత వేదిక అవసరమైందని సురవరం సుధాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో సైతం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందని.. ఒక రకంగా చెప్పాలంటే వారి పోరాటాల్లో నిజాయితీ ఉండడం లేదని ఆయన అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే కూటమిలో కాంగ్రెస్‌ పార్టీ భాగమవుతుందా.. లేదా అన్నవిషయంకూడా చర్చించాల్సి ఉందని చెప్పారు. కొత్త కూటమిలో పార్టీలే కాకుండా సామాజిక వేత్తలు, మేధావులకు కూడా భాగస్వాములు అవుతారని చెప్పారు.

మోదీ నేతృత్వంలో బలంగా ఉన్న బీజేపీ, సంఘ్‌ పరివార్‌ను 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే.. విస్తృతమైన వేదిక లేద కూటమి అవసరమని సీపీఐ మరో సీనియర్‌ నేత డీ. రాజా చెప్పారు. బీజేపీని నిలువరించలేకపోతే.. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే ప్రమాదముందని చెప్పారు. ఎన్నికల నాటికి దేశంలో బీజేపీ అనుకూల.. బీజేపీ వ్యతిరేక కూటమలుగా పార్టీలు విడిపోతాయని ఆయన అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top