పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

The cotton must be bought by the government

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

సాక్షి, హైదరాబాద్‌: రైతుల నుంచి పత్తిని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. క్వింటాల్‌ పత్తికి రూ.7వేల మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే సేకరించాలని పేర్కొంటూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 46లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైందని, 18 జిల్లాల్లో వర్షాలకు 30లక్షల ఎకరాల్లో పంటకు నష్టం జరిగిందని వెల్లడించారు. రైతులకు పంట నష్ట పరిహారం త్వరగా అందించాలని.. గిట్టుబాటు ధర లేకుంటే రైతులు ఆత్మహత్య చేసుకునే ప్రమాదముందని తమ్మినేని హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top