ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఓ రోల్‌ మోడల్‌..

Congress MLC Jeevan Reddy Praises AP CM YS Jagan - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  వయసులో చిన్నవాడైనా ప్రజాజీవితంలో ఓ రోల్‌ మోడలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌ దేశంలోనే ఓ రోల్‌ మోడల్‌ కాబోతున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ను చూసైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేల్కోవాలని హితవుపలికారు. ఏపీ ముఖ్యమంత్రిని తెలంగాణకు స్వాగతిస్తున్న కేసీఆర్‌, పార్టీ ఫిరాయింపులపై పునరాలోచించాలని కోరారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రతిపక్షం బలహీనమైతే నష్టపోయేది పాలకపక్షమేనని అన్నారు. తెలంగాణలో గడిచిన ఐదేళ్లలో విద్యా వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదని తెలిపారు. ఏపీలో విద్యాహక్కు చట్టం అమలు చేయడంతోపాటు పిల్లలను బడికి పంపించే తల్లుల అకౌంట్లో రూ.15 వేలు డబ్బులు వేయడం అభినందనీయమన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top