ముహూర్తం ఏ క్షణంలో పెట్టుకున్నాడో కానీ..

Congress Leader DK Aruna Slams KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముందస్తు ముహూర్తం ఏ క్షణంలో పెట్టుకున్నాడో కానీ ఆ పార్టీకి ఒక్క అంశం కూడా కలిసిరావడం లేదని కాంగ్రెస్‌ మాజీ మంత్రి డీకే అరుణ ఎద్దేవా చేశారు. ఎన్ని సభలు పెట్టినా టీఆర్‌ఎస్‌ బలం రోజురోజుకి తగ్గిపోతుందన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ చెప్పే అబద్దాలన్నీప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధిని కేసీఆర్‌ చేసినట్లు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ కొండా సురేఖకు చాలా అన్యాయం చేసిందన్నారు. ఆ పార్టీకి మహిళల పట్ల గౌరవం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

పెట్రో, డీజిల్‌ రేట్ల పెంపుకు నిరసనగా భారత్‌ బంద్‌ : బట్టి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను పెంచి ప్రజలను హింసిస్తున్నారని టీపీసీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల పెంపుకు నిరసనగా అన్ని పార్టీలతో కలిసి కాంగ్రెస్‌ ఈ నెల 10న భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చిందని పేర్కొన్నారు. వ్యవసాయం చేసుకునే రైతుకు ఎకరాకు 60 లీటర్ల డీజిల్‌ ఖర్చవతుందని.. రేట్ల పెంపుతో వారిపై భారం పడుతుందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ద్వారానే తెలంగాణ ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయన భారాన్ని ప్రజలపై మోపుతుందని ఆరోపించారు. దేశంలోని మిగతా 22 రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఎక్కువ పన్నులు విధిస్తున్నారని మండిపడ్డారు. మరింత పన్నులు వేయడానికే కేసీఆర్‌ మరోసారి గెలిపించమని కోరుతున్నారని ఎద్దేవా చేశారు.  పెంట్రోల్‌, డీజిల్‌లను జీఎస్టీలోకి తీసుకొస్తే రేట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పెట్రో, డీజిల్‌ రేట్లను తగ్గిస్తామని హామి ఇచ్చారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top