వైఎస్సార్‌ సీపీ నేతలే లక్ష్యం

Chittoor Police Target to YSRCP Leaders - Sakshi

దాడి చేయడమే కాకుండా మళ్లీ ఎదురు కేసులు

పోలీస్‌ స్టేషన్‌లో బైండోవర్లు గుర్రంకొండలో పెట్రేగిపోతున్న టీడీపీ నేతలు

వైఎస్సార్‌ సీపీ నేతలనే పోలీసులు టార్గెట్‌ చేస్తున్నారు. పార్టీ మండల కన్వీనర్‌ కన్వీనర్‌ ముక్తియార్‌పై టీడీపీ నాయకులు గత మంగళవారం దాడి చేశారు. అంతేకాకుండా ముక్తియార్‌తోపాటు పార్టీకి చెందిన ఎంపీపీ, మాజీ ఎంపీపీ, మండల ప్రత్యేక ఆహ్వానితులతోపాటు మరికొందరు ముఖ్యనేతలపై  ఎదురు కేసులు బనా యించారు. రాత్రికి రాత్రే వైఎస్సార్‌ సీపీ నేతలపై కేసులు నమోదు చేయడంతోపాటు  కేసుల్లో ఉన్నవారినందరినీ బుధవారం బైండోవర్‌ చేశారు.

చిత్తూరు, గుర్రంకొండ: స్థానిక తెలుగు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ నాయిని అమరేంద్ర టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయడంతోపాటు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ కుటుంబీకులు పోటీ చేయగా వారి తరఫున ప్రచారం చేయడమే కాకుండా డబ్బులు కూడా పంపిణీ చేశారంటూ గ్రామానికి చెందిన కొందరు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ అధికారులతో పాటు ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ నెల 2న మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విచారణ చేశారు. అయితే ఈ విచారణ గురించి టీడీపీ నేతలకు మాత్రమే ముందస్తు సమాచారం ఇవ్వడంతో వారు మందీ మార్బలంతో అక్కడి చేరుకుని తమకు అనుకూలంగా విచారణలో కొందరిచేత చెప్పించుకున్నారు. ఇది తెలుసుకున్న ముక్తియార్‌ అక్కడికి చేరుకున్నారు. ప్రిన్సిపల్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తవమని, ఇకనైనా పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు ముక్తియార్‌ను కళాశాలలోని ఓ గదిలో నిర్బంధించి మరీ దాడి చేశారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ ఎత్తున గుర్రంకొండ బస్టాండకు చేరుకున్నాయి.

మండల మాజీ ప్రత్యేక ఆహ్వానితులు కందుల గుణశేఖర్, మాజీ ఎంపీపీ జమీర్‌ ఆలీఖాన్‌ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమకు జరిగిన అన్యాయంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉదయాన్నే ఎఫ్‌ఐఆర్‌ నకలు ఇస్తామని చెప్పి పోలీసులు వైఎస్సార్‌ సీపీ నేతలను పంపించి వేశారు.  బుధవారం ఉదయం కథ అడ్డం తిరిగింది. ఎఫ్‌ఐఆర్‌ నకలు కోసం వెళ్లిన వైఎస్సార్‌ సీపీ నేతలను పొలీసులు బైండోవర్‌ చేసుకున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అవాక్కయ్యాయి. దాడలు చేసింది వారైతే తమపై నిష్కారణంగా తప్పుడు కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. రాజకీయ ఉద్రిక్తత వాతావరణం దృష్ట్యా ఇరుపార్టీల నాయకులపై కేసులు చేసామని పేర్కొన్నారు. ముక్తియార్, కందుల గుణశేఖర్, జమీర్‌ ఆలీఖాన్,  ఎంపీపీ నక్కా చంద్రశేఖర్, నాయకులు నాయిని శివశంకర్, మోహిద్దీన్, మల్లికార్జున, నూర్‌తో పాటు ఉపాధ్యాయుడు షబ్బీర్‌పై టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. వీరిలో ఉపాధ్యాయుడు షబ్బీర్, ముక్తియార్‌ మాత్రమే కాకుండా మిగిలినవారంతా అదే సమయంలో గుర్రంకొండకు పక్కనే ఉన్న ఎగువ అమిలేపల్లెలో పీలేరు అసెంబ్లీ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండడం గమనార్హం! అయినా కేవలం టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలపై ఏకపక్షంగా అక్రమ కేసులు బనాయించడంపై విమర్శలొస్తున్నాయి. మరోవైపు గుర్రంకొండలో ఇప్పటికే పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను దింపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top