టీఆర్‌ఎస్‌వి దిగజారుడు రాజకీయాలు

chada venkata reddy commented over trs

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు దిగజారుడు రాజకీయాలు ప్రదర్శిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. సీపీఐ అనుబంధ కార్మిక సంఘం నేతలను టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. మఖ్దూం భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాత్రి వేళల్లో రహస్యంగా తమ నాయకుల ఇళ్లకు వెళ్లి లక్షలాది రూపాయలు ఆశ చూపుతున్నారని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జాతీయ సంఘాలతోనే సింగరేణిలో కార్మికుల హక్కులకు రక్షణ ఉంటుందని, తాము అధికారం కోసం కాకుండా కార్మికుల సంక్షేమం కోసమే పనిచేస్తామన్నారు. తమ సంఘ నేతలు మారిపోతున్నారంటూ ఎంపీ సుమన్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఇదే తరహాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top