భజనపరులకు ఉద్యోగాలు కల్పించారు: చాడ

Chada venkata reddy commented over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ భజనపరులకు సాంస్కృతిక సారథుల పేరుతో ఉద్యోగాలు కల్పించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. కళల్లో ఏ ప్రతిభ, అనుభవం లేని వారికి అవకాశం ఇవ్వడంతో సాంస్కృతిక సారథుల నియామకాలు ఏకపక్షంగా, డబ్బులు తీసుకొని నియమించారనే వార్తలు వచ్చాయని తెలిపారు.

చట్టాల వెలుతురులో పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం దొడ్డిదారిన, ఇష్టారాజ్యంగా కళాకారుల ఉద్యోగాలను భర్తీ చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా చట్ట పరిధిలో ఆయా ఉద్యోగాలకు విధి విధానాలు రూపొందించి, ఇంటర్వ్యూలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top