సర్వేల్లో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత: చాడ 

Chada Venkat Reddy Comments on TRS - Sakshi

హుస్నాబాద్‌: ఆగమేఘాల మీద అసెంబ్లీని రద్దు చేసి, 105 మంది అభ్యర్థులను ప్రక టించిన కేసీఆర్‌.. ఆ తర్వాత చేసిన సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రావడంతో మౌనమునిలా మారారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 50 బహిరంగ సభలు పెడతామని ఆర్భాటంగా ప్రకటించి, ఒకటి, రెండు సభలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన హుస్నాబాద్‌ లో విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమి ఏర్ప డిన తర్వాత రాజకీయ చర్చలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అన్నారు.

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యం గా మహాకూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. ఎన్ని కలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని, ఓట రు తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసేలా తగిన వాతావరణం కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను కోరనున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో డబ్బుల సం చులు కుమ్మరించే పరిస్థితి నెలకొందని,  నిఘా ఏర్పా టు చేసి కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. మహా కూటమిలో పలానా పార్టీకి ఇన్ని సీట్లు.. అన్ని సీట్లు అని లీక్‌లు ఇస్తున్నారని, దీంతో ఎలాంటి ప్రయో జనం ఉండదని చాడ అన్నారు.  తమ పార్టీకి 9 సీట్లు కోరామని, సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాలేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top