‘పంచింగ్‌’ స్టార్ట్‌! 

Cash And Liquor Distribution Is Start In Telangana Lok Sabha Election 2019 - Sakshi

మొదలైన నగదు, మద్యం పంపిణీ

సాక్షి, హైదరాబాద్‌ : పార్లమెంటు ఎన్నికల్లో ప్రచార గడువు ముగుస్తున్న కొద్దీ.. ‘కట్టల’పాములు బయటికి వస్తున్నాయి. నేటితో ప్రచారం ముగుస్తున్నందున.. సాయంత్రం నుంచే నగదు, మద్యం పంపిణీకి తెరలేవనుంది. ఇప్పటికే రూ.కోట్ల మొత్తంలో నగదు చోటా నేతలకు చేరిపోయిందని సమాచారం. ఆధిప త్యం కోసం అధికార పార్టీ, ఉనికి కోసం ప్రతిపక్షాలు పోటీ పడుతున్న ఈ ఎన్నికలు రెండింటికీ ప్రతిష్టాత్మకంగానే మారాయి. దీంతో నేతలంతా ఖర్చుకు వెనకాడటం లేదు. 

ప్రతి నియోజకవర్గంలో.. 
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ విజ యం సాధించింది. ఆ ఎన్నికల్లో ఘోర పరాజ యం చవిచూసిన ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఎలాగైనా ఈసారి సత్తా చాటాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో నువ్వా–నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నా యి. మొత్తం 17 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థుల ఖర్చు అనధికారికంగా రూ.50 నుంచి 60 కోట్లకు పైగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఖమ్మం స్థానాల్లో అభ్యర్థుల ఖర్చు భారీగా ఉంటున్నట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గంలో రూ.150 కోట్ల వరకు ఖర్చు అవుతుం దని తెలిసింది. ఈ లెక్కన 5 నియోజకవర్గాల్లోనే రూ.750 కోట్లు దాటనుంది. మిగిలిన 11 నియోజకవర్గాల్లో రూ.550 నుంచి రూ.660 కోట్ల వరకు ఖర్చు కావచ్చు. ఈ లెక్కన రూ.1,400 కోట్ల వరకు పార్టీలు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఘడియలు సమీపిస్తున్న కొద్దీ.. 
పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ.. ‘కట్టల’ పాములు బయటకు వస్తున్నాయి. మంగళవారం ప్రచారానికి ఆఖరి రోజు, దీంతో ఇప్పటికే చేరుకున్న నగదును ముందే సిద్ధం చేసుకున్న జాబితాల ప్రకారం.. పంపిణీ మొదలైంది. మరికొందరైతే ఫోన్‌ పే, పేటీఎమ్‌లను వాడుతున్నారు. ఈ మొత్తం చిన్నగా ఉండటం అంతా స్నేహితులవడం వల్ల ఇలాంటి చోట పంపిణీ చాలా సులువుగా మారింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top