ఎలక్షన్‌.. (కన్‌)ఫ్యూజన్‌

Candidates in Good Day Hunting for Nominations - Sakshi

‘‘డబుల్‌ యాక్షన్‌ సినిమాలు హిట్‌ అవుతుంటాయి. ఎందుకు? మన అభిమాన నటుడు తెరపై ఒకరు కనిపిస్తేనే ఎంతో సంబరం! అలాంటిది వాళ్లు తెరనిండా రెండ్రెండు రోల్స్‌లో ఇద్దరిద్దరుగా కనపడితే ఆనందం మాత్రం రెట్టింపు కాదా! ఇదే సేమ్‌ టు సేమ్‌ ప్రిన్సిపుల్‌ ‘పొలిటికల్‌ స్క్రీన్‌’ మీద కూడా వర్కవుట్‌ అవుతుంటుందని రాజకీయాభిమానుల ఆశ’’ 

‘‘అదేంట్సార్‌... ఎలక్షన్లకూ, డబుల్‌ యాక్షన్లకూ పోలికేంటి?‘‘
‘‘ఉంది. ఇక్కడ మనం రాజకీయ నాయకుల ముఖాలను పరిగణనలోకి తీసుకోకూడదు. కేవలం పార్టీల ప్రవర్తననూ, వాటి తీరుతెన్నులను మాత్రమే పరిశీలించాలి’’

‘‘అదెలా సార్‌?’’ 
‘‘ఇప్పుడు చూడు. ఉదాహరణకు తెలుగుదేశం, కాంగ్రెస్‌ ఇద్దరూ వేర్వేరు హీరోలనుకుందాం. అప్పుడేమవుతుంది? ఏ పార్టీ అభిమాని తమ పార్టీని హీరో అనుకుంటాడు. ఎదుటి పార్టీని విలన్‌గా చూస్తాడు. కానీ ఇవి రెండూ ఇప్పుడు కలిసిపోయాక ఏమవుతుంది. రెండు పార్టీల అభిమానులకూ ఈ రెండు పార్టీలూ ఒకేలా.. అనగా.. హీరోల్లాగే అనిపించాలి’’

‘‘అప్పుడది మల్టీస్టారర్‌ కావాలి కానీ డబుల్‌ యాక్షన్‌ ఎలా అవ్వుద్ది సార్‌?’’ 
‘‘అక్కడే ఉంది తమాషా! ఇద్దరు వేర్వేరు పార్టీల్లాగా బిహేవ్‌ చేస్తుంటే అలాగే మల్టీస్టారర్‌ కావాలి. కానీ కలిసిపోయినప్పుడు ఇక్కడ సీన్‌ వేరేలా అనిపిస్తుంటుంది’’ 

‘‘వేరేలా అంటే?’’
‘‘ఇప్పుడున్న 119 స్థానాల్లో కాంగ్రెస్సేమో 95 స్థానాలకు పోటీ చేసే పార్టీ. దాంతో అదేమనుకుంటుందీ? ఇన్ని స్థానాలకు పోటీచేసే తానే అతి పెద్ద పార్టీ కాబట్టి తానే పెద్దన్న అనుకుంటుంది. వాళ్లొచ్చి మమ్మల్ని బతిమాలి మాతో కలిశారు గానీ మేం కాదుకదా అని కూడా దెప్పిపొడుస్తుంది. ఇక్కడ మరో తిరకాసూ ఉంది. అన్నేసి స్థానాలకు పోటీచేసే ఆ పార్టీ అభ్యర్థులను తన ఇంటెలిజెన్స్‌తో తనే ఇంటెలిజెంట్‌గా డిసైడ్‌ చేస్తానంటాడు టీడీపీ అధినేత. మరి ఇప్పుడిక్కడ పెద్దన్న పాత్ర ఎవరిది? టీడీపీ వారిదే కదా. మరప్పుడు ఒకేసారి ఇద్దరు పెద్దన్నలు ఎలా ఉంటారు? ఉండరు కదా. అంటే ఇద్దరు ఒకే సమయానికి పుట్టిన ఐడెంటికల్‌ ట్విన్స్‌ అన్నమాట. ఫలితంగా ఇప్పుడు ఎలక్షన్‌ స్క్రీన్‌పై సీన్‌లో ఇద్దరు ఒకేలా కనిపించే హీరోలవుతారు. దాంతో సీన్‌ పండి సినిమా హిట్టవుతుందని వాళ్లందరి ఆశ’’ 
‘‘రెండు అంశాలు కలవడాన్ని ఫ్యూజన్‌ అంటారు కదా! రెస్టారెంట్‌లో ఫ్యూజన్‌ క్వెజిన్, సినిమాల్లో ఫ్యూజన్‌ మ్యూజిక్‌ హిట్టవుతాయేమో కానీ ఇప్పుడిది మాత్రం ఫ్యూజన్‌గా అనిపించడం లేదు సార్‌’’ 
‘‘మరేమిటిది?’’
‘‘కన్ఫ్యూజన్‌!’’.

4 ముహూర్తాలు
12వ తేదీ: సోమవారం, పుర్వాషాఢ నక్షత్రం, అధిపతి శుక్రుడు. శుక్రుడి వల్ల కొద్ది ఇబ్బందులున్నా.. మంచి ఫలితాలే లభిస్తాయి. బలమైన ముహూర్తం.
14వ తేదీ: 12–19 మధ్య తేదీల్లోనే ఇది బలమైన ముహూర్తం. శ్రావణ నక్షత్రం. అధిపతి ధరణి.. పాలన యోగం పట్టిస్తాడు. ఇది వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం కావడంతో మరింత బలం చేకూరుతుంది. 
18వ తేదీ: ఆదివారం. పూర్వాభాద్ర నక్షత్రం. అధిపతి కుజుడు. మధ్యస్థ ముహూర్తం. ఫలితాలూ అలానే ఉంటాయి.
19వ తేదీ: కార్తీక సోమవారం. రేవతి నక్షత్రం, అధిపతి పూష. నామినేషన్ల దాఖలుకు ఇదీ మంచి ముహూర్తమే. 

  మంచిరోజుల వేటలో అభ్యర్థులు
  12, 14, 18, 19 తేదీలు మంచివి: పురోహితులు

ఏ పని చేయాలన్నా మంచి ముహూర్తం చూసుకోవడం రివాజు. రాజకీయాల్లోనైతే ఈ సెంటిమెంట్‌పై మరీ మోజు. అందుకే, అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ‘మంచి రోజుల’ కోసం అభ్యర్థులు పురోహితుల చుట్టూ తిరుగుతున్నారు. 12, 14, 18, 19 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని, ఈ రోజుల్లో నామినేషన్‌ వేస్తే కలిసొ స్తుందని చెప్పలేమని, అదృష్ట యోగం కూడా ఉండాలని వనపర్తికి చెందిన జ్యోతిష పురోహితులు జోషి గోపాలశర్మ చెబుతున్నారు. 
..:: సిలివేరు యాదగిరి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top