చంద్రబాబు నాటకాల్ని నమ్మొద్దు

Botsa Satyanarayana Comments On Chandrababu Politics - Sakshi

ప్రశాంత ఎన్నికలే సీఎం జగన్‌ ధ్యేయం  

అల్లర్లు జరిగితే వేలాది నామినేషన్లు ఎలా నమోదవుతాయి? 

రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ

విజయనగరం: చంద్రబాబు నాటకాలు, కుయుక్తులను ఎవరూ నమ్మొద్దని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. శనివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించటమే సీఎం వైఎస్‌ జగన్‌ ధ్యేయమని చెప్పారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. 
- ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగటం లేదని, శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతోందని బాబు నిందారోపణలు చేస్తున్నారు. 
- చిన్న చిన్న ఘటనలు మినహా రాష్ట్రమంతటా శాంతియుతంగానే ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. 
- చంద్రబాబు పాలనతో పోల్చుకుంటే 99 శాతం ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. 
- 9,696 ఎంపీటీసీ స్థానాలకు సుమారు 50 వేల మంది అభ్యర్ధులు, 652 జెడ్పీటీసీ స్థానాలకు 1,500 మంది అభ్యర్ధులు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ స్థానాలకు సుమారు 20 వేల నామినేషన్లు దాఖలయ్యాయి.  
- ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని చెప్పటానికి ఇంత పెద్ద సంఖ్యలో దాఖలైన నామినేషన్లే తార్కాణం. 
- స్థానిక వివాదాలను చూపించి బాబు లబ్ధి పొందాలని చూస్తున్నారు.  
- బాబు ఎంత  రెచ్చగొట్టినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పట్టించుకోకుండా శాంతియుతంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారన్నారు. 
- చంద్రబాబు తానా అంటే.. పవన్‌ కల్యాణ్‌ తందాన అంటున్నారు.  
- 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల కన్నా మిన్నగా 98 శాతం ఓటర్లు స్థానిక ఎన్నికల్లోనూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించనున్నారు.  
- ఇప్పటికే చాలా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 
- విజయనగరం జిల్లాలోనే మూడు జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top