వైఎస్సార్‌సీపీలోకి కొత్తనీరు

BJP Leader Join In YSRCP In Praja Sankalpa Yatra - Sakshi

పార్టీలో చేరిన  కళా ఆస్పత్రి ఎండీ డా.పీవీ రమణమూర్తి,

ఎస్‌.కోట బీజేపీ నాయకుడు రఘురాజు

పేదల వైద్యుడు డా.రమణమూర్తి

విశాఖ సిటీ : వైఎస్సార్‌సీపీలోకి కొత్తనీరు వచ్చి చేరుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పదీక్షతో రాజన్న స్వర్ణయుగం మళ్లీ వస్తుందనే ఆశతో వైద్యులు, ఇతరపార్టీ నాయకులు చేరుతున్నారు. బుధవారం పెందుర్తి నియోజకవర్గంలో జరిగిన జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పయాత్రలో కళా ఆస్పత్రి ఎండీ డా.పీవీ రమణమూర్తి, కేంబ్రిడ్జ్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రఘురాజు పార్టీలో చేరారు. సామాజిక స్పృహ ఉన్న వారు పార్టీలోకి రావడం శుభపరిణామమని జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

విశాఖసిటీ : ప్రముఖ సామాజికవేత్త, కళా ఆస్పత్రి ఎండీ డా. పీవీ రమణమూర్తి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో డా. రమణమూర్తి సతీసమేతంగా పార్టీలో చేరారు. పెందుర్తి నియోజకవర్గం గుల్లేపల్లిలో సాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో జగన్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. రమణమూర్తితో పాటు ఆయన సతీమణి డా. కళావతి, మామయ్య రామారావుతో పాటు పెద్ద ఎత్తున అనుచరులు పార్టీలో చేరారు. అందరికీ జగన్‌ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. డా. రమణ మూర్తి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రం సుభిక్షంగా మారిందనీ, ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో బతికారని, ఆ కాలం ఓ స్వర్ణయుగం వచ్చిందన్నారు. రాజన్న వైద్యుడు కావడం వల్లే.. ప్రజల నాడి తెలుసుకొని, వారి ఆనందమయ జీవితానికి ఏం కావాలో అదే అందించారని కొనియాడారు.

గొప్ప వైద్యునిగా, సామాజిక వేత్తగా ప్రజల్లో రమణమూర్తికి మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు సైతం కార్పొరేట్‌ వైద్యాన్ని అందించి.. పేద ప్రజల హృదయాల్లో వైఎస్సార్‌ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రేషన్‌కార్డుల మంజూరు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో పాటు రాష్ట్రంలో జలసిరులు కురిపించేలా అనేక నీటి ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేశారన్నారు. వైఎస్సార్‌ మరణం తర్వాత.. రాష్ట్రం ఒక్కసారిగా వందేళ్ల తిరోగమనానికి వెళ్లిపోయిందనీ వ్యాఖ్యానించారు. మళ్లీ.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాజన్న కాలంలో ఉన్న స్వర్ణయుగం వస్తుందనే భరోసా చిన్న పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకూ కలుగుతోందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన నిలబడుతూ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాలను చూస్తుంటే వైఎస్సార్‌ ఆశయ సాధనకు ఎంత తపన పడుతున్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అందువల్లే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని డా.రమణమూర్తి వెల్లడించారు.  ఉత్తరాంధ్ర జిల్లాలో పేద ప్రజలకు మంచి వైద్యం అందిస్తూ.. నిరంతరం అందుబాటులో ఉండే వైద్యుడిగా డా. రమణమూర్తి పేరొందారు.

కళా ఆస్పత్రి ఆధ్వర్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలుమార్లు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేద ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేశారు. డా.రమణమూర్తి దంపతులు సేవాభావంతో కళా ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడం, పేద, ధనిక వ్యత్యాసం చూడకుండా చికిత్సలు చెయ్యడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు వీరి ఆస్పత్రి సంజీవనిగా మారింది.  అంతే కాకుండా.. కేంద్ర ప్రభుత్వం పిలుపుతో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తూ..ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నగర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తూ.. నగరాన్ని హరిత వనంగా తీర్చిదిద్దడంలో డా.రమణ మూర్తి దంపతులు కీలక పాత్రపోషిస్తున్నారు. వీరు పార్టీలోకి రావడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు.

రఘురాజు చేరికతో హర్షం
భారతీయ జనతాపార్టీ ఎస్‌.కోట నియోజకవర్గ కన్వీనర్, కేంబ్రిడ్జ్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఇందుకూరి రఘురాజు వైఎస్సార్‌సీపీలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఎస్‌.కోట జెడ్పీటీసీగా, మండల ఉపాధ్యక్షునిగా, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షునిగా రఘురాజు పనిచేశారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షునిగా, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సభ్యునిగా, జిల్లా ప్లానింగ్‌ కమిటీ సభ్యునిగా, స్టేట్‌ యూత్‌కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా పదవులు నిర్వహించారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 33వేలు పైచిలుకు, 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలిచి 31వేల పైబడి ఓట్లు సాధించారు. క్రియాశీలక రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్నారు. రఘురాజు రాకతో ఎస్‌.కోట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు

12-11-2018
Nov 12, 2018, 18:03 IST
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌...
12-11-2018
Nov 12, 2018, 12:37 IST
రాజమండ్రి ఎంపీ సీటు బీసీలకు ఇస్తామని ఇదివరకే ప్రకటించామని..
12-11-2018
Nov 12, 2018, 11:56 IST
సాక్షి, విజయనగరం : తనపై హత్యాయత్నం జరిగినా అదరక, బెదరక... మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి.. పాదయాత్రను కొనసాగిస్తున్న ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌...
12-11-2018
Nov 12, 2018, 08:17 IST
హత్యాయత్న ఘటననంతరం జనంలోకి జననేత 
12-11-2018
Nov 12, 2018, 06:56 IST
సంకల్పం మంచిదైతే... ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించవచ్చు. ఆశయం అందరి మేలుకోరేదైతే... ఎన్ని కుట్రలనైనా ఎదుర్కొనవచ్చు. జనం ఆశీస్సులు మెండుగా...
12-11-2018
Nov 12, 2018, 03:51 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ సాక్షి ప్రత్యేక ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప...
11-11-2018
Nov 11, 2018, 16:37 IST
సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్‌: పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం...
11-11-2018
Nov 11, 2018, 15:46 IST
సాక్షి, సాలూరు: తనపై జరిగిన హత్యాయత్నం అనంతరం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోలుకొని ప్రజలతో...
11-11-2018
Nov 11, 2018, 11:01 IST
సాక్షి, విశాఖపట్నం: ధీరోదాత్తుడు మళ్లీ ప్రజా సంకల్పయాత్రకు సిద్ధమయ్యారు. తనపై జరిగిన హత్యాయత్నం అనంతరం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ...
11-11-2018
Nov 11, 2018, 07:28 IST
అన్న వస్తున్నాడు... అవును జగనన్న వచ్చేస్తున్నాడు. కుట్రలను ఛేదించుకుని... మృత్యువుని జయించి... సంకల్పాన్ని చేరుకునేందుకు... జనం మధ్యకు దూసుకు వస్తున్నాడు....
11-11-2018
Nov 11, 2018, 04:07 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 17 రోజుల విరామం అనంతరం ఈ నెల 12 నుంచి...
10-11-2018
Nov 10, 2018, 11:21 IST
విశాఖ విమానాశ్రయంలో గత నెల 25న వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో..
10-11-2018
Nov 10, 2018, 08:32 IST
శ్రీకాకుళం , పార్వతీపురం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 12న జిల్లాలో పునఃప్రారంభమవుతుందని,...
07-11-2018
Nov 07, 2018, 07:15 IST
ఆయనో.. నవశకం.. చీకటి తెరల్లో చిక్కుకున్న రాష్ట్రానికి నవరత్నాల వెలుగులు నింపేందుకు ఆ యువనేత వేసిన తొలి అడుగు.. ప్రభంజనమైంది....
06-11-2018
Nov 06, 2018, 13:36 IST
పాలకుల్లో సమన్యాయం లోపించింది. కుట్రలుకుతంత్రాలకు పాల్పడుతున్నారు. అడుగడుగునాఅన్యాయానిదే పైచేయి అవుతోంది. అణగారినవర్గాలకు రిక్తహస్తం ఎదురవుతోంది. రైతులకుభరోసా లేదు, అర్హతతో నిమిత్తం...
06-11-2018
Nov 06, 2018, 13:29 IST
హత్యకు కుట్ర.. ఆగ్రహిస్తున్న జనం ప్రజా సమస్యలే అజెండాగా జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎండనకా..వాననకా, చలి అనకా పాదయాత్ర సాగిస్తున్నారు....
06-11-2018
Nov 06, 2018, 13:14 IST
ఆయన గమ్యం.. ఐదు కోట్ల ఆంధ్రుల మోముపై చిరునవ్వులొలికించే సంతకంఅడుగడుగునా పేదల కష్టాలను ఆలకించి..    చలించిపోతున్న మానవత్వం. తాను నడిచిన...
06-11-2018
Nov 06, 2018, 13:08 IST
అలుపెరగని బాటసారి అతను. నిత్యం వేలాది మందిని కలుస్తూ వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు. వ్యక్తిగత సమస్యలు మొదలుకొని...
06-11-2018
Nov 06, 2018, 12:53 IST
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :   చంద్రబాబు పాలనలో సమస్యలు పరిష్కారం కాక అష్టకష్టాలు పడుతున్న జనం సమస్యలను తెలుసుకొని వాటిని...
06-11-2018
Nov 06, 2018, 12:08 IST
ఆయన.. ప్రజాహితుడు..ప్రజల సంక్షేమం కోరే పథకుడు..జన సంకల్పానికి నిలువెత్తు రూపం..మహానేత రాజన్న ప్రతిరూపం..అభ్యాగులకు అభయం..అంతకంతకూ పెరుగుతోన్న ప్రజాభిమానంఅధికార పార్టీకదే అసహనంఅందుకే...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top