బాబు అవినీతిపై సీబీఐ విచారణ జరగాలి 

BJP and Janasena leaders demand CBI Inquiry On Chandrababu - Sakshi

చిత్తూరులో బీజేపీ, జనసేన నాయకుల దీక్ష 

చిత్తూరు కార్పొరేషన్‌: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ, జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు. చిత్తూరు నగరంలో సోమవారం ఆ పార్టీల నాయకులు సంయుక్తంగా నిరసన దీక్ష చేశారు. దీక్షలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నేత గోళ్లహరిప్రసాద్‌ చౌదరి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దయారాంలు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకొని దొరికిన చోటల్లా దోచుకుతిన్నారన్నారు.

జన్మభూమి కమిటీ, నీరు–చెట్టు, ఎల్‌ఈడీ బల్బులు, రోడ్డు కాంట్రాక్ట్‌లు, పరిశ్రమల అనుమతుల్లో ఇష్టారాజ్యంగా అక్రమాలు చేశారని ఆరోపించారు. చిత్తూరు నగరంలోని టౌన్‌బ్యాంకులో జరిగిన రూ.1.80 కోట్ల అవినీతే అందుకు సాక్ష్యమన్నారు. లేని కంపెనీలు సృష్టించి తప్పుడు లావాదేవీలు చేశారన్నారు. తాజాగా చంద్రబాబు మాజీ పీఎస్‌ కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడుల్లో ఇది బట్టబయలైందన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top