ఆత్మహత్య కాదు.. బాబు సర్కార్‌ హత్య: భూమన 

Bhumana Karunakar Reddy Slams Chandrababu Naidu Over Youth Suicide To SCS - Sakshi

సాక్షి, తిరుపతి : ప్రత్యేక హోదా కోసం ఓ యువకుడు ఆత్మ బలిదానం చేసుకోవడం దురదృష్టకరమని వైఎస్సార్‌ సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మదనపల్లి చేనేత కార్మికుడు సుధాకర్‌ది ఆత్మహత్య కాదని, చంద్రబాబు సర్కార్‌ చేయించిన హత్య అని ఆయన మండిపడ్డారు. శనివారం భూమన విలేకరులతో మాట్లాడుతూ.. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి వల్లే బలిదానాలు జరుగుతున్నాయన్నారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకుండా.. చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలు దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా మారిందని, ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. తిరుపతిలో గతంలోనే మునికోటి బలవన్మరణానికి పాల్పడ్డాడని, అప్పుడే తమ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. దయచేసి ఎవరూ ఆత్మ త్యాగాలకు పాల్పడవద్దని, ఇలాంటి ఘటనల వల్ల ప్రయోజనం లేదని, బత్రికి ఉండి అందరం కలిసి పోరాడి హోదా సాధించుకుందామని భూమన పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా మన హక్కు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి మదన పల్లి చేనేత కార్మికుడు సుధాకర్‌(26) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

చదవండి: ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు: వైఎస్‌ జగన్‌

హోదా కోసం మరొకరు ప్రాణత్యాగం

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top