బకాసురుడు అన్నదానం చేసినట్లు ఉంది

Bhumana Karunakar Reddy Says Chandrababu Words Like a Bakasura - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని పనులు తానే చేశానని చెప్పడం బకాసురుడు అన్నదానం చేసినట్టు ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. శుక్రవారం జరిగిన పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల వైఎస్సార్‌సీసీ బూత్‌ కన్వీనర్ల శిక్షణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనే మా సిద్ధాంతం. చంద్రబాబు చేసే విమర్శలకు ఇదే మా సమాధానం. చంద్రబాబు ఉన్న తెలుగుదేశం పార్టీ ఆయనది కాదు. ఎన్టీఆర్‌ని దగా, వంచన చేయడమే చంద్రబాబు జీవితం. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లాంటి నాయకుడి వద్ద ఉన్నందుకు మేమంతా గర్వపడుతున్నాం.

ముఖ్యమంత్రి పదవి ఎవరో పడస్తే తీసుకునే బిక్ష కాదని అన్న వ్యక్తి వైఎస్‌ జగన్‌. నిరంతరం ప్రజా క్షేత్రంలో ఉంటూ తన తండ్రి ఆశయాలు సాధన కోసం వైఎస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ లాంటి ప్రతిపక్ష నేత లేకుంటే చంద్రబాబు అరాచకాలు మరింతగా ఉండేవి. వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర మావో చేసిన లాంగ్‌ మార్చ్‌ని తలపిస్తోంది. రాజన్న ఆశయాలు సాధించడానికి మనం కూడా వైఎస్‌ జగన్‌కు చేదోడుగా ఉందాం’  అని తెలిపారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top