అవిశ్వాసం : రాహుల్‌పై సెటైర్లే సెటైర్లు

#BhookampAaneWalaHai: Twitter Mocks Rahul Gandhi Ahead Of No Confidence Motion - Sakshi

న్యూఢిల్లీ : దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న కేంద్రంపై అవిశ్వాస సమయం ఆసన్నమైంది. అవిశ్వాసంపై చర్చను సైతం స్పీకర్‌ ప్రారంభించేశారు. ఈ నేపథ్యంలో ఏ నిమిషాన ఏమవుతుందోననే దేశ ప్రజల్లో క్షణక్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. ఎందుకంటే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ సమావేశంలో మాట్లాడనుండటం. అదేమిటి రాహుల్‌ గాంధీ మాట్లాడితే ఏ మవుతుంది అనుకుంటున్నారా? భూకంపం వస్తుందట. భూకంపం రావడమేంటి? ఆయనేమనా సైంటిస్టా? ఈ విషయం చెప్పడానికి అని ఆలోచిస్తున్నారా? అవునండి. ఆయన సైంటిస్టే అయిపోయారు. తనకు పార్లమెంట్‌లో మాట్లాడటం అనుమతిస్తే, ఏం జరుగుతుందో మీరే చూద్దురు గానీ, భూకంపం వస్తుంది అని గతంలో ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే ఇప్పుడు రాహుల్‌ గాంధీపై కుళ్లు జోకులు పేలేలా చేస్తోంది.

అయ్యో ఈ రోజు రాహుల్‌ గాంధీని పార్లమెంట్‌ మాట్లాడేలా స్పీకర్‌ అనుమతించారు, ఏం జరుగుతుందో ఏమో అంటూ నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. కేవలం సెటైర్లు మాత్రమే కాక ఏకంగా ఓ హ్యాష్‌ట్యాగ్‌ను సైతం నడుపుతున్నారు. #BhookampAaneWalaHai అంటూ.. బీజేపీ మద్దతుదారులు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. ఈ హ్యాష్‌ట్యాగే ప్రస్తుతం ట్విటర్‌లో టాప్‌ ట్రెండ్‌గా ఉంది. బీజేపీ ఐటీ సెల్‌ అధినేత అమిత్ మాల్వియా సైతం ఓ వీడియోతో రాహుల్‌ గాంధీ అంతకముందు పార్లమెంట్‌ ప్రసంగాన్ని ట్వీట్‌ చేశారు. గత కొన్ని సార్లు పార్లమెంట్‌లో రాహుల్‌ మాట్లాడారు. అవి చాలా మెమెరబుల్‌, నేటి ప్రసంగం కూడా అంతే ఉంటుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top