కమీషన్ల కోసమే భోగాపురం టెండరు రద్దు

Bhogapuram tender is canceled for commissions - Sakshi

ధ్వజమెత్తిన అంబటి రాంబాబు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) చేజిక్కించుకున్న భోగాపురం విమానాశ్రయం టెండరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కమీషన్ల కోసమే రద్దు చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పీఏసీ (రాజకీయ వ్యవహారాల మండలి) సభ్యుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎన్నికలు మరో ఏడాదిలో జరుగనున్న తరుణంలో ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం రాష్ట్రానికి ముప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విజయనగరంలో ఏర్పాటు చేయబోయే భోగాపురం ఎయిర్‌పోర్టు టెండరును 30.2 శాతం ఇస్తామన్న ఏఏఐకే ఇవ్వాల్సి ఉండగా... భూసేకరణ పూర్తి కాలేదనే నెపంతో దాన్ని రద్దు చేశారని విమర్శించారు. అదానీ పోర్ట్సు, ఎస్‌ఈజెడ్‌ సంస్థపై ఈడీ కేసులున్నాయని రక్షణ శాఖ కూడా ఈ విషయాన్ని హెచ్చరించినా కేవలం కమీషన్ల కోసమే భావనపాడు పోర్టును అప్పగించారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top