హోదా ఇవ్వకుంటే ఒకే రాష్ట్రం చేయండి

bc's national president demand special status for andhra pradesh - Sakshi

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్‌

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్‌ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌ విలేకరులతో ఆయన మాట్లాడారు. విభజన హామీలను నెరవేర్చలేనప్పుడు మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలను ఒకటిగా కలపాలని కోరారు. ప్రత్యేక హోదాను సాధించాల్సిన టీడీపీ ప్రజలను నిలువునా ముంచేసిందని అన్నారు. అస్సాం, నాగాలాండ్, జమ్మూకాశ్మీర్, అరుణాచల్‌ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఉత్తరాఖండ్, త్రిపుర, హిమాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఇచ్చిన కేంద్రం ఏపీకి ఎందుకు ఇవ్వలేకపోతోందని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top