కేంద్ర సంస్కరణలకు కేసీఆర్‌ వక్రభాష్యం

Bandi Sanjay Comments On KCR - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం విధానాలు ఫ్యూడల్‌ విధానంలో ఉన్నాయని సీఎం కేసీఆర్‌ మాట్లాడటం హాస్యాస్పదమని, కేంద్రం సంస్కరణలకు వక్రభాష్యం చెబుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన ప్యాకేజీ ఎంత ఉపయోగకరమో ప్రజలు రాబోయే రోజుల్లో తెలుసుకుంటారని చెప్పారు. ఇంతకాలం కాంగ్రెస్‌ హయాంలో విదేశీ అనుకూల విధానాలే అమలవుతూ వచ్చాయి తప్ప దేశీయ విధానాలు అమలు కాలేదన్నారు.

సంస్కరణలు అమలు చేయాలని కేంద్రం చెబితే, రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అని కేసీఆర్‌ అంటున్నారని విమర్శించారు. అంటే కేంద్రం నేరుగా నగదు ఇస్తే తమ జేబులు నింపుకుందామనా? అని ప్రశ్నించారు. గతంలో ఇదంతా జరిగిందేమో కానీ మోదీ సర్కార్‌ హయాంలో ఇది సాధ్యం కాదన్నారు. ఆర్బీఐ సూచనలను అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక శాఖ కార్యదర్శులకు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేరుగా వివరించారని, వారు అంగీకరించారని తెలిపారు. ఇపుడేమో వద్దని అంటున్నారని, వాటిని అంగీకరించినప్పుడు ఇంగితం ఏమైందని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top