ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగానే చూసింది’

Bandaru dattatreya commented over congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకుగానే చూసిందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ విమర్శించా రు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం పరిరక్షణకు, బీసీల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలతో మోదీ సర్కారుపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.

సమాజం లో అసమానతలు తొలగించి, సామాజిక న్యా యం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే జాతీ య ఓబీసీ కమిషన్‌కు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని నిర్ణయం తీసుకుందన్నారు. 75 ఏళ్లలో కాంగ్రెస్‌ ఈ పని ఎందుకు చేయలేదని ప్రశ్నిం చారు. రాష్ట్రంలో మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న టీఆర్‌ఎస్‌ హామీ ఏమైం దని ఎద్దేవా చేశారు. అనంతరం హిందూస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ కంపెనీలో డైరెక్టర్‌గా నియమితుడైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డిని సన్మానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top