ఎన్నికల్లో మద్యానికి గేట్లెత్తేసిన ఏపీ ఎక్సైజ్‌ శాఖ

AP Excise Department Gives Permission To Rise in Liquor Sale - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మద్యానికి అడ్డుకట్ట వేయాల్సిన ఎక్సైజ్‌ శాఖ .. నిబంధనలకు విరుద్దంగా మద్యం షాపుల స్టాక్‌పై ఆంక్షలు ఎత్తేసింది. ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కిన ఎక్సైజ్‌ అధికారులు.. 4100 షాపులకు వేల కోట్ల మద్యం కొనుగోలుకు అనుమతినిచ్చారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఎక్సైజ్‌ అధికారులు సోమవారం రాత్రి హుటాహుటిన సిండికేట్లకు అనుమతినిచ్చారు.

ఎన్నికల్లో మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేసేందుకు దగ్గరుండి మరి సహకారం చేస్తున్నారు. ఎన్నికేసులు నమోదైనా మద్యం విడిపించుకునేలా అనుమతులిస్తున్నారు. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే ముందు చంద్రబాబు నాయుడు ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ను బదిలీ చేసి కొత్త అధికారిని ప్రత్యేకంగా నియమించుకున్నారు. మద్యంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు ఏకంగా ఎక్సైజ్‌ అధికారులనే రంగంలోకి దింపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top