విజయనగరంలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌!

Andhra Pradesh Election Results 2019 YSRCP Clean Sweep In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టిస్తోంది. విజయనగరం జిల్లాలో అయితే ఏకంగా క్లీన్‌స్వీప్‌ దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం కౌటింగ్‌ ఫలితాల సమాచారం మేరకు జిల్లాలోని 9 స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. జిల్లాలోని కురుపాం(ఎస్టీ), పార్వతీపురం(ఎస్సీ), సాలూరు(ఎస్టీ), బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెలిమర్ల, విజయనగరం,శృంగవరపుకోట అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కేవలం 3 స్థానాలనే కైవసం చేసుకోగా.. టీడీపీ 6 స్థానాల్లో గెలిచింది. ఇక తాజా ఫలితాల్లో వైఎస్‌ జగన్‌ చరిష్మా.. నవరత్నాలు, పాదయాత్రలో జిల్లా ప్రజలతో మమేకమవడం వంటి అంశాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపినట్లు స్పష్టమైంది. దీంతో 9 స్థానాల్లో గెలుపు దిశగా వైఎస్సార్‌సీపీ దూసుకెళ్తుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top