ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

Andhra Pradesh Assembly Sessions Live Updates - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకానికి తెరతీసిన 15వ శాసనసభ కొలువుదీరింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం 11.05 గంటలకు 15వ శాసనసభ తొలి సమావేశం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు. జాతీయ గీతంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ముఖ్యమంత్రి, సభానాయకుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదట శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం అక్షర క్రమంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి మినహా మొత్తం 173మంది సభ్యులు ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తప్పుగా ప్రమాణం చేశారని ప్రొటెం స్పీకర్‌ చిన అప్పలనాయుడు తెలుపడంతో ఆయన మరోసారి శాసనసభ సభ్యుడిగా దైవసాక్షిగా ప్రమాణం చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రమాణం అనంతరం అసెంబ్లీ గురువారం ఉదయం 9 గంటలకు వాయిదా పడింది.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే అంటూ.. దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. అనంతరం ప్రొటెం స్పీకర్‌ అప్పలనాయుడిని మర్యాదపూరకంగా కలిసి.. అభివాదం చేశారు. రిజిస్టర్‌లో సంతకం చేశారు.

ఆ తర్వాత ఎన్‌ చంద్రబాబునాయుడి అనే నేను.. టీడీపీ అధినేత చంద్రబాబు దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

శాసనసభ సభ్యులుగా మంత్రుల ప్రమాణ స్వీకారం ఈ విధంగా సాగింది

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన అంజాద్‌ బాషా షేక్‌ బేపారి అనే నేను.. అంటూ అల్లా సాక్షిగా  ఆయన ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన పుష్పశ్రీవాణి అనే నేను అంటూ దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన నారాయణస్వామి కే అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన అనిల్‌కుమార్‌ పాలుబోయిన అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన గౌతంరెడ్డి మేకపాటి అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన గుమ్మనూరు జయరాం అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కురసాల కన్నబాబు అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన మాలగుండ్ల శంకరనారాయణ అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన బొత్స సత్యనారాయణ అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన చెరుకువాడ శ్రీరంగనాథరాజు అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కొడాలి శ్రీ వెంకటేశ్వర్‌రావు అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన ముత్యంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్‌ అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన వెలంపల్లి శ్రీనివాసరావు అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన శ్రీమతి మేకతోటి సుచరిత అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన ఆదిమూలపు సురేశ్‌ అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన తానేటి వనిత అనే నేను అంటూ దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన పేర్ని వెంకట్రామయ్య నాని అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన పినిపె విశ్వరూప్‌ అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఈ విధంగా సాగుతోంది...

 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యురాలైన కట్టుపల్లి భాగ్యలక్ష్మి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యురాలైన ఆదిరెడ్డి భవానీ (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యురాలైన నాగులపల్లి ధనలక్ష్మీ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యురాలైన విశ్వసరాయ కళావతి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యురాలైన జొన్నలగడ్డ పద్మావతి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యురాలైన విడదల రజని (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యురాలైన ఆర్కే రోజా (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యురాలైన రెడ్డి శాంతి (వైఎస్సార్‌సీపీ)  అనే నేను అంటూ దైవసాక్షిగా పవిత్ర హృదయంతో ఆమె ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యురాలైన కంగాటి శ్రీదేవి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యురాలైన ఉండవల్లి శ్రీదేవి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యురాలైన ఉషాశ్రీచరణ్‌ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆమె ప్రమాణం చేశారు
   
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన అబ్బయ్య చౌదరి కొఠారి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్‌ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ అల్లాసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన అన్నంరెడ్డి అదీప్‌ రాజ్‌ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కొనేటి ఆదిమూలం (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన అనిల్‌కుమార్‌ కైలే (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన గుడివాడ అమర్‌నాథ్‌ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన బొత్స అప్పలనర్సయ్య (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన తొగూర్‌ ఆర్థర్‌ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
   
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన  అశోక్‌ బెందాళం (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కింజరపు అచ్చెన్నాయుడు (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన ఎం బాబు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన గొల్ల బాబురావు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన తెల్లం బాలరాజు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన నందమూరి బాలకృష్ణ (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన వై బాలనాగిరెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కరణం బలరామకృష్ణమూర్తి (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన బొల్లా బ్రహ్మన్నాయుడు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన గంగుల బ్రిజేంద్రరెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన సింగారెడ్డి చక్రపాణిరెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
   
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన జ్యోతుల చంటిబాబు (వైఎస్సార్‌సీపీ)  అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన చెన్నకేశవరెడ్డి. కే (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన నిమ్మకాయల చినరాజప్ప (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కొండేటి చిట్టిబాబు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కరణం ధర్మశ్రీ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన పెండెం దొరబాబు (వైఎస్సార్‌సీపీ)  అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన వున్నమట్ల ఎలీజా (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన శ్రీ గణవెంకటరెడ్డి నాయుడు గణబాబు (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన వాసుపల్లి గణేష్‌కుమార్‌ (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన మద్దాలి గిరిధర్‌రావు (టీడీపీ)  అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన మొండితోక జగన్‌మోహన్‌రావు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన చిర్ల జగ్గిరెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన అలజంగి జోగారావు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన వీ జోగేశ్వర్‌రావు (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కంబాల జోగులు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన భూమన కరుణాకర్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన గొర్లె కిరణ్ కుమార్ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన పయ్యావుల కేశవ్‌ (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన బియ్యపు మధుసూదన్‌ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన మానుగుంట మహీధర్‌ రెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కాసు మహేశ్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన బూడి ముత్యాలనాయుడు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన డాక్టర్‌ మేరుగ నాగార్జున (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కుందూరు నాగార్జునరెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన దూలం నాగేశ్వరరావు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన తిప్పల నాగిరెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన మహమ్మద్‌ నవాజ్‌బాషా (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ అల్లాసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన చెట్టి ఫాల్గుణ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కొలుసు పార్థసారథి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కేతిరెడ్డి పెద్దారెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన ముదునూరి ప్రసాదరావు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన ధర్మాన ప్రసాదరావు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కోన రఘుపతి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన శెట్టిపల్లి రఘురామిరెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన దాడిశెట్టి రాజా (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన జక్కంపూడి రాజా (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
   
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన పీడిక రాజన్న దొర (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కొక్కిలిగడ్డ రక్షణనిధి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన ఆళ్ల రామకృష్ణారెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన గద్దె రామ్మోహన్‌ (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన చింతల రామచంద్రారెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కాపు రామచంద్రారెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన వెలగపూడి రామకృష్ణ బాబు (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన డాక్టర్‌ నిమ్మల రామానాయుడు (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన ఆనం రామనారాయణరెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన మంతెన రామరాజు కల్వపుడి రాంబాబు (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన అంబటి రాంబాబు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన అన్నా వెంకట రాంబాబు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కాటసాని రాంభూపాల్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన సింహాద్రి రమేశ్‌బాబు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
   
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన జోగి రమేశ్‌ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కాటసాని రామిరెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన గొట్టిపాటి రవికుమార్‌ (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన వై సాయిప్రసాద్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన ఏలూరి సాంబశివరావు (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కిలివేటి సంజీవయ్య (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన నంబూరి శంకర్‌రావు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన సత్యప్రసాద్‌ అనగాని (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన టీజేఆర్‌ సుధాకర్‌ బాబు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన డాక్టర్‌ జే సుధాకర్‌ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన ఎం సుధీర్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన సత్తి సూర్యానారాయణరెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన ఎం తిప్పేస్వామి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన సామినేని ఉదయభాను (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన వల్లభనేని వంశీ (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన రాపాక వరప్రసాదరావు (జనసేన) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన వెలగపల్లి వరప్రసాద్‌ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన వీరభద్రస్వామి కోలగట్ల (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన వసంత వెంకట కృష్ణప్రసాద్‌ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన మేడా వెంకట మల్లికార్జునరెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కారుమూరి వెంకట నాగేశ్వరరావు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన ఉప్పలపాటి వెంకటరమణరాజు కన్నబాబు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కిలారి వెంకట రోశయ్య (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన ఎల్లారెడ్డిగారి వెంకటరామిరెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన అనంత వెంకటరామిరెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన తలారి వెంకటరావు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన జీ వెంకటసుబ్బయ్య (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన ఎం వెంకటయ్య గౌడ్‌ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన మద్దిశెట్టి వేణుగోపాల్‌ (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన మల్లాది విష్ణు (వైఎస్సార్‌సీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడినైన డాక్టర్‌ డొలా శ్రీ బాలవీరాంజనేయస్వామి (టీడీపీ) అనే నేను అంటూ దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు

సీఎం హోదాలో తొలిసారి అసెంబ్లీకి వైఎస్‌ జగన్‌
ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ ద్వారం వద్ద సీఎం వైఎస్‌ జగన్‌కు పూర్ణకుంభంతో వేదపపండితులు స్వాగతం పలికారు. అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనసభలో బుధవారం అడుగుపెట్టారు. అద్వితీయమైన ప్రజాదరణ ఉన్న నేత సభా నాయకుడి స్థానాన్ని అధిష్టించడం రాష్ట్ర చరిత్రలో ఇది మూడోసారి. గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీ రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి సభా నాయకులుగా రాష్ట్ర శాసనసభకు వన్నె తెచ్చారు. మళ్లీ కొత్త చరిత్రను లిఖిస్తూ వైఎస్‌ జగన్‌ అద్వితీయమైన ప్రజాదారణతో పార్టీని విజయపథంలో నడిపించి ప్రజా ముఖ్యమంత్రిగా శాసనసభలో సభానాయకుడి స్థానాన్ని అలంకరించారు.
 

ఈ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది: రోజా
వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా, తాము ఎమ్మెల్యేలుగా 15వ అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండటం ఎంతో ఆనందంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. దేశమంతటికీ ఆదర్శంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

మరికాసేపట్లో 15వ అసెంబ్లీ సమావేశాలు ‍ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకానికి తెరతీసిన 15వ శాసనసభ మరికాసేపట్లో కొలువుదీరనుంది. ఐదుకోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆశలను మోసుకుంటూ భవితకు భరోసానిస్తూ కొత్త శాసనసభ తొలిసారిగా బుధవారం సమావేశం కానుంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అఖండ మెజార్టీతో ప్రజలు ఓ పార్టీకి అధికారం అప్పగించిన శాసనసభ. చరిత్ర సృష్టిస్తూ సుదీర్ఘ పాదయాత్ర చేసిన జననేత ముఖ్యమంత్రిగా సభా నాయకుడి హోదాను అలంకరించబోతున్న సభ కూడా ఇదే. 25 మంది మంత్రుల్లో ఏకంగా 19 మంది కొత్త మంత్రులుగా అధికార స్థానాల్లో కూర్చొనబోతున్న సభ. గత 30 ఏళ్లలో అత్యధిక శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు చట్టసభలో అడుగుపెట్టబోతున్న సభ కూడా ఇదే.. అందుకే బుధవారం తొలిసారిగా కొలువుదీరనున్న 15వ శాసనసభపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. గత శాసనసభ ప్రజాస్వామ్యానికి మిగిల్చిన మరకలను చెరిపేస్తూ.. గత ఐదేళ్ల కష్టాల నుంచి సాంత్వన కోరుతూ కొత్త శాసనసభ వైపు ఆశగా చూస్తున్నారు.

సీఎంగా తొలిసారి శాసనసభలోకి..
అశేష ప్రజాభిమానంతో తిరుగులేని జననేతగా గుర్తింపు పొందిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనసభలో బుధవారం అడుగుపెట్టనున్నారు. అద్వితీయమైన ప్రజాదరణ ఉన్న నేత సభా నాయకుడి స్థానాన్ని అధిష్టించడం రాష్ట్ర చరిత్రలో ఇది మూడోసారి. గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీ రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి సభా నాయకులుగా రాష్ట్ర శాసనసభకు వన్నె తెచ్చారు. మళ్లీ కొత్త చరిత్రను లిఖిస్తూ వైఎస్‌ జగన్‌ అద్వితీయమైన ప్రజాదారణతో పార్టీని విజయపథంలో నడిపించి ప్రజా ముఖ్యమంత్రిగా శాసనసభలో సభానాయకుడి స్థానాన్ని అలంకరించనున్నారు.

నేటి ఉదయం 11.05 గంటలకు సభ ప్రారంభం
రాష్ట్ర 15వ శాసనసభ తొలి సమావేశం బుధవారం ఉదయం 11.05 గంటలకు ప్రారంభించాలని ముహూర్తం నిర్ణయించారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత ముఖ్యమంత్రి, సభానాయకుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబు, మంత్రులు, సభ్యులతో అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 175 మంది సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ముగియని పక్షంలో గురువారం ఉదయం కొనసాగిస్తారు. 13వ తేదీన స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు.

అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, మంత్రులు ఆయన్ను ఆధ్యక్ష స్థానం దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేయనున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన సీతారాంకు సభ అభినందనలు తెలియజేస్తుంది. మరుసటి రోజు అంటే 14వ తేదీ ఉదయం 9 గంటలకు ఉభయసభల సభ్యులనుద్ధేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు. కొత్త  ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలను గవర్నర్‌ తన ప్రసంగం ద్వారా స్పష్టం చేయనున్నారు. గవర్నర్‌ ప్రసంగం ముగిశాక సభ వాయిదా పడుతుంది. 15, 16వ తేదీలు సెలవు రోజులు కావడంతో సభ తిరిగి 17వ తేదీన ప్రారంభం అవుతుంది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగుతుంది. సభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెబుతారు. దీంతో ఈ సమావేశాలు ముగుస్తాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top