అమిత్‌ షా‌.. టీ-20 ఫార్ములా

Amith Shah New Game Plan For Lok Sabha Elections - Sakshi

లక్నో : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కీలకంగా మారిన ఉత్తర ప్రదేశ్‌లో మెజార్టీ సీట్లు సాధించేందుకు బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తోంది. దీనిలో భాగంగా అమిత్‌ షా టీ-20 పార్ములాను నేతలకు సూచించారు. ఎమ్మెల్యే, ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని ప్రతీ గ్రామాల్లో ఇరవై ఇళ్లలో టీ తాగి వారికి తమ ప్రభుత్వ పథకాల గురించి వివరించాలని సూచించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీ 70 సీట్లకు పైగా విజయం సాధించిన బీజేపీ ఇటీవల జరిగిన గోరఖ్‌పూర్‌, పుల్‌పూర్‌, కైరానా ఉప ఎన్నికల్లో ఘోర పరజయం పాలనైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఈ నెల 11, 12 తేదీల్లో మీరట్‌లో కీలక నేతలతో భేటి అయ్యారు.

2019 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను సమాయత్తం చేశారు. దీనికి ఎవరు అతీతులు కాదని అందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాలని అమిత్‌ షా అదేశించారు. రాష్ట్రంలోని దళిత, ఓబీసీ ఓటర్లపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని పార్టీ నేతలను ఆయన ఆదేశించారు. ఎన్‌ఆర్‌సీపై మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా  చొరడడేవారిని దేశంలోకి అనుమతించమని, హిందూ శరణార్ధుల భయపడాల్సిన అవసరంలేదని తమ ప్రభుత్వం వారిని గౌరవిస్తుందని అమిత్‌ షా పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top