‘ఒక ధృవతార రాలిపోయింది’

Amit Shah Pays Condolence To Atal Bihari Vajpayee Dies - Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. దేశానికి ఒక ధృవతార రాలిపోయిందని విచారం వ్యక్తం చేశారు. కోట్లాది యువకులకు ప్రేరణ కల్పించిన నేత, అజాశశత్రువును కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. భారత రాజకీయా రంగానికి వాజ్‌పేయి మరణం తీరని లోటు అన్నారు. బీజేపీ ఒక గొప్ప నాయకున్ని కోల్పొయిందని పేర్కొన్నారు.

దేశం ఓ గొప్ప రాజకీయవేత్తను కోల్పోయిందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. అటల్‌జీ మృతిపట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌లు సంతాపం తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top