ముందు వినడం నేర్చుకోండి ఒవైసీ : షా క్లాస్‌

Amit Shah Lashed Out At AIMIM President Asaduddin Owaisi In Lok Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సవరణ బిల్లుపై సోమవారం లోక్‌సభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. బీజేపీ సభ్యుడు సత్యపాల్‌ సింగ్‌ బిల్లుపై ప్రసంగిస్తుండగా.. అసదుద్దీన్‌ మధ్యలో కల్పించుకుని మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇలా పదేపదే ఆయన ప్రసంగానికి అడ్డుతగలడంతో అమిత్‌ షా తీవ్ర అసహనికి గురయ్యారు. వెంటనే ఆయన కల్పించుకుని ఒవైసీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

‘‘సభ్యుడు మాట్లాడుతుండగా.. పదేపదే మధ్యలో ఎందుకు ఆటకం కలిగిస్తున్నారు. ప్రసంగాన్ని ఎలా వినాలో ముందు నేర్చుకొండి’’ అంటూ ఘాటుగా క్లాస్‌ ఇచ్చారు. అనంతరం ఎదో చెప్పడానికి ప్రయత్నించిన ఒవైసీ.. స్పీకర్‌ కల్పించుకోవడంతో ప్రసంగాన్ని వింటూ కూర్చున్నారు. కాగా ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top