ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం: తమ్మినేని

An alternative political platform is required - tammineni - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజాతంత్రయుత ప్రత్యామ్నాయం ఏర్పాటుకు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని, కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో ఓ ప్రత్యామ్నాయ వేదిక నిర్మించాలని భావిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

సామాజిక న్యాయం–తెలంగాణ సమగ్రాభివృద్ధి ఎజెండాగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించడం అవసరమని సీపీఎం భావిస్తున్నట్లు తెలిపారు. ఎంబీ భవన్‌లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. టీమాస్‌ తరఫున సోమవారం కంచ ఐలయ్య, గద్దర్, విమలక్క, జాన్‌ వెస్లీ తదితరులతో కలసి వరంగల్‌ మార్కెట్‌ యార్టును సందర్శిస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 18–22 తేదీల్లో హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top