87వ రోజు పాదయాత్ర డైరీ

87th day padayatra diary - Sakshi

14–02–2018, బుధవారం
జంగాలపల్లి,
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

అందుకే నవరత్నాల్లో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చా..
నీతి, నిజాయితీ, నిబద్ధతలతో రాజకీయ జీవితాన్ని నడిపిన దళిత నేత, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యగారి జయంతి సందర్భంగా.. ఆయనకు నివాళులర్పించి, ఈ రోజు పాదయాత్ర మొదలెట్టాను. ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించేందుకు నాన్నగారు మొదలుపెట్టి, దాదాపు పూర్తిచేసిన ఉత్తర కాలువను దాటి కృష్ణారెడ్డిపాళెంలోకి ప్రవేశించాను. కాళ్లు, చేతులు వంకర్లు పోయి, నడుం వంగిపోయిన ఒక వృద్ధురాలిని మోసుకుంటూ ఒకాయన నా దగ్గరికొచ్చాడు. ఆమెకు పళ్లు కూడా విరిగిపోయినట్లున్నాయి. ఏంటయ్యా.. అని అడిగాను. ‘ఇదంతా మా ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్‌ తెచ్చిపెట్టిన కష్టం సార్‌.. ఈమె నా భార్య. ఈమెకే కాదు, ఈమె కడుపుతో ఉన్నప్పుడు లోపల బిడ్డపై కూడా దాని ప్రభావం పడింది.

ఆ బిడ్డా ఇప్పుడు వికలాంగుడే’ అంటూ బాధగా చెప్పాడు. ఆమె పేరు అంకమ్మట. వయసు 35 సంవత్సరాలని చెప్పగానే ఆశ్చర్యపోయాను. ఇంత చిన్న వయసుకే ముసలితనాన్నిచ్చింది ఫ్లోరైడ్‌ దుష్ఫ్రభావమేనని అవగతమైంది. ఫ్లోరైడ్‌ దెబ్బకు తన రెండు కిడ్నీలూ పాడైపోయాయని ఆ గ్రామానికే చెందిన మస్తానన్న చెప్పాడు. ఆ ఊళ్లోనే పది మందికి పైగా కిడ్నీ బాధితులున్నారట. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సైతం ఫ్లోరైడ్‌ వల్ల కిడ్నీలు పాడైనవాళ్లు, వికలాంగులు, చిన్న వయసులోనే వృద్ధాప్యఛా యలు కమ్ముకున్నవారు ఎందరో ఉన్నారట. ఒక్కసారిగా మనసెంతో బరువెక్కింది. వీరేం తప్పు చేశారు? ఎందుకు వీళ్లకీ శిక్ష? ముమ్మాటికీ ఈ పాపం ఫ్లోరైడ్‌ది కాదు.. తీర్చగలిగే అవకాశం ఉండీ, నిర్లక్ష్యం వహిస్తూ.. మొద్దు నిద్ర నటిస్తున్న నేటి దుర్మార్గపు పాలకులది. పక్కనే ఉత్తర కాలువ పోతున్నా తాగునీరు అందించని ఈ తోలుమందం ప్రభుత్వానిది.

ఆ ఊరు దాటి ముందుకెళ్లగానే కుడుములదిన్నెపాడు వద్ద రోడ్డు పక్కనే ఓ చలివేంద్రం కనిపించింది. ఆ పక్కనే ఉన్న దంపతులిద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటూ నా వద్దకొచ్చారు. ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న వారి పెద్ద కుమారుడు అంకమ్మరావు జ్ఞాపకార్ధం ఆ చలివేంద్రం పెట్టారట. ‘అంత పెద్ద కష్టం ఎందుకొచ్చింది తల్లీ’ అని అడగ్గానే.. ‘కూలీ నాలీ చేసుకుంటూ జీవితాన్ని నెట్టే బతుకులయ్యా మావి. మాలా మా బిడ్డలు కష్టపడకూడదని వారిని బాగా చదివిం చాలనుకున్నాం. మా పెద్దోడు ఇంజినీరింగ్‌లో సీటు తెచ్చుకున్నాడు. కానీ ఫీజు రూ.70 వేలట. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.35 వేలే వచ్చాయి. అమ్మా.. మిగతా డబ్బు కట్టగలరా? అని అడిగేవాడు. మీకు చాలా కష్టమైపోతోందమ్మా.. అంటూ కుమిలిపోయేవాడు. నిరుడు వినాయక చవితి రోజు మా కష్టం గురించి మరింత ఎక్కువగా ఆలోచించాడేమో. నాన్నా.. నన్ను చదివించడానికి మీరు పడుతున్న కష్టాన్ని చూడలేకపోతున్నా.. పేదవాళ్లుగా పుట్టడమే మనం చేసుకున్న పాపమేమో.. అని ఉత్తరం రాసి, ఉరేసుకుని చనిపోయాడు’ అంటూ ఆ దంపతులు గుండె చిక్కబట్టుకుని కడుపు కోతను చెప్పుకొన్నారు. చాలా బాధేసింది.

ఆ పేదింట చదువుల సౌరభాలు వెదజల్లి, పేదరికాన్ని పారదోలాల్సిన ఆ విద్యా కుసుమం మధ్యలోనే రాలిపోవడం నా మనసును కలచివేసింది. పేదవాళ్లు పెద్ద చదువులు చదువుకోవాలను కోవడమే శాపమైతే.. మరి ఆ పాపం ఎవరిది? వారికి ఆ ఆశపెట్టి మోసపుచ్చిన పాలకులది కాదా? పేదరికం అన్నది చదువుకు ఏ మాత్రం అడ్డుకాకూడదని నాన్నగారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టి.. ఫీజులను సంపూర్ణంగా, సకాలంలో చెల్లించేవారు. కానీ, నేటి ప్రభుత్వం అరకొర ఫీజులు చెల్లిస్తూ.. ఆ కాస్త కూడా నెలల తరబడి పెండింగ్‌ పెడుతూ, లబ్ధిదారులైన విద్యార్థుల సంఖ్యను తగ్గిస్తూ, ఆ పథకాన్ని నీరుగార్చి.. గాలిలో దీపంలా తయారు చేసింది. పేద బిడ్డల జీవితాల్లో చీకటి తెరలు కమ్ముకునేలా చేస్తోంది. అంకమ్మరావులాంటి పేద విద్యా ర్థుల ఉసురు తీస్తోంది. ఏ పేదవాడికీ ఈ పరిస్థితి రాకూడదు. అందుకే నవరత్నాల్లో అటు వైద్యానికి, ఇటు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాను. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన తొలి ఐదు సంతకాలలో ఒకటి.. ప్రతి గ్రామానికీ రక్షిత మంచినీటి సరఫరా. నాలుగేళ్లయిపోయాయి. ఆ పథకం ఏమైంది? మినరల్‌ వాటర్‌ సంగతి దేవుడెరుగు.. కనీసం తాగడానికి సర్ఫేస్‌ వాటరైనా ఇచ్చుంటే.. ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకైనా కొంత మేర ఉపశమనం కలిగేది కదా? మీ తొలి సంతకానికే దిక్కులేకపోతే.. మీరిచ్చిన వందలాది హామీల మాటేంటి? 
-వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు

15-10-2018
Oct 15, 2018, 08:17 IST
వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 286వ రోజు సోమవారం ఉదయం ఎస్‌. బూర్జవలస శివారు నుంచి ప్రారంభమైంది.
15-10-2018
Oct 15, 2018, 07:12 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు తాగునీరు కూడా అందించడం లేదన్నా..మా గ్రామంలో సుమారుగా 450 ఇళ్లు ఉండగా గ్రామంలో...
15-10-2018
Oct 15, 2018, 07:00 IST
నా వయస్సు 65 సంవత్సరాలు. పైగా భర్త కూడా చనిపోయాడు. అయినప్పటికీ ఈ మాయదారి ప్రభుత్వానికి నాకు పింఛన్‌ ఇవ్వాలన్న...
15-10-2018
Oct 15, 2018, 06:55 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అలుపెరగని బాటసారిగా ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి...
15-10-2018
Oct 15, 2018, 06:48 IST
బతుకుదెరువు కోసం తగరపువలస నుంచి మురడాంనకు సుమారు నాలుగేళ్ల కిందట వచ్చాను. ఇంతవరకు రేషన్‌కార్డు లేదు. నా భర్త 17...
15-10-2018
Oct 15, 2018, 06:42 IST
బొబ్బిలి రూరల్‌: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఈ నెల 17న బొబ్బిలి పట్టణంలో భారీ బహిరంగ...
15-10-2018
Oct 15, 2018, 06:37 IST
సాక్షిప్రతినిధి, విజయనగరం:  అడుగులన్నీ ఏకమవుతున్నాయి. పల్లెలు కదలివస్తున్నాయి. అలుపె రుగకుండా సాగుతున్న జగనన్నను అనుసరిస్తున్నాయి. వీరి రాకతో... విశాఖ–రాయపూర్‌ జాతీయ...
15-10-2018
Oct 15, 2018, 04:06 IST
14–10–2018, ఆదివారం ఎస్‌.బూర్జవలస, విజయనగరం జిల్లా టీచర్‌ పోస్టుల్లో కోత.. నిరుద్యోగులకు ద్రోహం కాదా బాబూ? ‘అభిమానం చాటుకోవడానికి మాటలే రానక్కర్లేదు. మనసుంటే చాలు’ అని...
15-10-2018
Oct 15, 2018, 03:50 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘నాడు ఇంటింటికీ ఉద్యోగాలన్నాడు.. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.....
14-10-2018
Oct 14, 2018, 16:56 IST
సాక్షి, గజపతి నగరం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ...
14-10-2018
Oct 14, 2018, 08:43 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డిని గజ పతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసప్పలనాయుడు కలిశారు. ప్రజాసంకల్ప...
14-10-2018
Oct 14, 2018, 08:36 IST
మెంటాడ మండలంలోని గుర్లగెడ్డ వద్ద రూ.4.18 కోట్లతో నిర్మించిన గుర్ల గెడ్డ ప్రాజెక్టు నుంచి ఏళ్లు గడుస్తున్నా సాగునీరు రావడం...
14-10-2018
Oct 14, 2018, 08:30 IST
ఆండ్ర రిజర్వాయర్‌ నుంచి మా గ్రామంలో పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. దీంతో సాగు భారంగా మారింది. పూర్తిగా...
14-10-2018
Oct 14, 2018, 08:24 IST
అన్న ఆశీర్వాదం దొరకడం మాకెంతో అదృష్టం. శనివారం తెల్లవారుజాము మూడు గంటలకు మాకు వివాహం జరిగింది. జగనన్న మా గ్రామం...
14-10-2018
Oct 14, 2018, 08:20 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం: తోటపల్లి ప్రాజెక్ట్‌ నీటి కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నామని గజపతినగరం నియోజకవర్గ సన్న, చిన్నకారు రైతుల తరఫున...
14-10-2018
Oct 14, 2018, 08:11 IST
సాక్షిప్రతినిధి విజయనగరం: జాతీయ రహదారి కాస్తా జనసమ్మర్దంతో నిండిపోయింది. ఆ మార్గంలో వచ్చే ప్రతీ బస్సూ ఆయనకోసం ఒక్క క్షణం...
14-10-2018
Oct 14, 2018, 07:17 IST
అడుగడునా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌..
14-10-2018
Oct 14, 2018, 02:46 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘తిత్లీ తుపానుతో సర్వనాశనమైన ఉద్దానాన్ని చంద్రబాబు దగ్గరుండి బాగు చేస్తాడంట.....
14-10-2018
Oct 14, 2018, 01:55 IST
13–10–2018, శనివారం  కోమటిపల్లి, విజయనగరం జిల్లా   నిరుద్యోగ భృతి మొక్కుబడి కార్యక్రమం కాక మరేంటి బాబూ?  ప్రజలకు మనస్ఫూర్తిగా మంచి చేయాలన్న ఆలోచన...
13-10-2018
Oct 13, 2018, 19:38 IST
సాక్షి, గజపతి నగరం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు,...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top