వైఎస్సార్‌ కుటుంబంలోకి 38 లక్షల మంది..

38 lakh people in YSR Kutumbham - Sakshi

వైఎస్‌ జగన్‌ సమీక్షలో వెల్లడి.. అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సమావేశాలు

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 11వ తేదీన ప్రారంభమైన ‘వైఎస్సార్‌ కుటుంబం’ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతా వరణంలో సాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికి 38 లక్షల మంది వైఎస్సార్‌ కుటుంబంలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ముఖ్యనేతలతో సమావేశమై ‘వైఎస్సార్‌ కుటుంబం’ కార్యక్ర మం సాగుతున్న తీరుపై సమీక్ష నిర్వహిం చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న స్పందనకు ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఇదే ఊపును కొనసాగించాలని, కార్యక్రమాన్ని బాగా ముందుకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యనేతల సమావేశంలో అభిప్రాయపడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యా దులపై కూడా జగన్‌ సమీక్షించారు. 13 జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని క్రియాశీలంగా చేపట్టాయని పార్టీ కేంద్ర కార్యా లయం శుక్రవారం ప్రకటించింది. ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న వైఎస్సార్‌ కుటుంబం జరు గుతున్న తీరు తెన్నూ, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిం చాలని జగన్‌ ఆదేశించారని పార్టీ నేతలు తెలిపారు.

గడపగడపకూ బూత్‌ కమిటీ సభ్యులు
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 4.3 లక్షల మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యులకు శిక్షణను ఇచ్చిన తరువాత వారంతా ఈ నెల 11 నుంచి రాష్ట్రంలోని ప్రతి గడపకూ వెళుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పాలన ఎలా ఉండేదో వారికి గుర్తు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, పింఛన్లు, ఫీజులు తిరిగి చెల్లింపు పథకాలు ఎలా అమలు జరిగేవో వివరించి చెబుతు న్నారు. అలాంటి పాలననే రాష్ట్ర ప్రజలకు అందించేందుకు జగన్‌ ఇటీవల జాతీయ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలు పథకాల గురించి వివరిస్తున్నారు. ఇంటి నుంచి ఒక్కరైనా వైఎస్సార్‌ కుటుంబంలో భాగస్వాముల య్యేలా చేస్తున్నారు. 91210 91210కు ఫోన్‌ చేయడం ద్వారా ఈ కుటుంబంలో చేరవచ్చని తెలియజేస్తున్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై అభిప్రాయాన్ని కూడా వారి నుంచి తెలుసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ఒక వేళ మార్కులు వేయాల్సి వస్తే ఎన్ని వేస్తారో వేయాలని కూడా అడుగుతున్నారు. వారికి పార్టీ తరపున ఓ కిట్‌ను అందజేస్తున్నారు. ఈ పబ్లిసిటీ కిట్‌లో వైఎస్సార్‌ కుటుంబానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్, విజిటింగ్‌ కార్డు, చంద్రబాబు పాలనపై మార్కులు వేసే పత్రం, వైఎస్సార్‌ బ్యాడ్జీ్జ, వైఎస్సార్‌ కుటుంబంలో చేరిన తరువాత వారి ఇంటికి వైఎస్సార్‌ కుటుంబం అని అంటించే స్టిక్కరు ఉంటాయి. అక్టోబర్‌ 2వ తేదీ వరకూ 20 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top