పాత్రికేయుల హత్యలు దారుణం

Journalists' murders are brutal - Sakshi

భువనేశ్వర్‌: దేశంలో పలు చోట్ల విధి నిర్వహణలో భాగంగా సేవల్ని అందిస్తున్న పాత్రికేయ మిత్రులు హత్యలకు గురి కావడం అత్యంత విచారకరం. ఈ చర్యలకు తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్థానిక ది ఒడిశా ప్రెస్‌ క్లబ్‌(ఓపీసీ) ప్రకటించింది. ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా పిలుపు మేరకు మహాత్మ గాంధీ జయంతి పురస్కరించుకుని పాత్రికేయుల సమైక్యతకు ప్రతీకగా స్థానిక కార్యాలయంలో మానవహారం ప్రదర్శించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో ది ఒడిశా ప్రెస్‌ క్లబ్‌(ఓపీసీ) అధ్యక్షుడు తథాగత శత్పతి ప్రసంగించారు. గత ఏడాది వ్యవధిలో 70 మంది పాత్రికేయులు హత్యలకు బలయ్యారు. 147 మంది పాత్రికేయులు మారణాంతక దాడులకు గురయ్యారు.

నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో ఈ గణాంకాల్ని వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో గౌరీ లంకేష్, సీనియర్‌ పాత్రికేయుడు కె.జె.సింఘ్‌ హత్యలు పురస్కరించుకుని ఈ చర్యలకు నిరసనగా నిరవధికంగా ఉద్యమించేందుకు దేశవ్యాప్తంగా ప్రెస్‌ క్లబ్‌లు ముందుకు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ది ఒడిశా ప్రెస్‌ క్లబ్‌(ఓపీసీ) ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ దాస్, కోషాధికారి జయాశిష్‌ రాయ్‌ వంటి ప్రముఖ పాత్రికేయులు ప్రసంగించారు. 

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top