భయపెడుతున్న స్వైన్‌ఫ్లూ


స్వైన్‌ప్లూ మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వ్యాధితో మృత్యువాత పడు తున్న వారి సంఖ్య పలు రాష్ట్రాలలో రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేకించి ఈ మహమ్మారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోందని ప్రసార సాధనాలు విస్తృతంగా వార్తలందిస్తు న్నాయి. కానీ పాలకులు మాత్రం ప్రమాద తీవ్రతను తక్కువ చేసి చూపడం దారుణం. ఇప్పటికైతే పరిస్థితి పూర్తిగా అదు పులో ఉందని తెలుగు రాష్ట్రాల అమాత్యులు ప్రకటనలు జారీ చేస్తున్నారు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ ప్రబలుతున్నట్లు సంకేతాలు ధ్వనిస్తున్నాయి. కనుక పాల కులు ఇప్పటికైనా మేల్కొనాలి. స్వైన్‌ఫ్లూ వ్యాప్తి గురించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలి.

 

 ఈ చలికాలంలో అసలే డెంగ్యూ, వైరల్ జ్వరాలతో ప్రజలు కలవరపడుతుంటే పులిమీద పుట్రలా స్వైన్‌ఫ్లూ విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే నిపుణులైన వైద్యులతో, ప్రసార సాధనాల ద్వారా ఈ వ్యాధి లక్షణాలు, నిర్ధారణ, చికిత్సలపై ప్రజలకు తగిన అవగాహన కల్పించాలి. అన్ని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో యుద్ధ ప్రాతిపదికన చికిత్స కోసం ముం దస్తు ఏర్పాట్లు చేయాలి.

 బి. రామకృష్ణ దేవాంగ  దక్షిణ మోపూరు, నెల్లూరు

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top