గ్రహం అనుగ్రహం (24-02-2017)

గ్రహం అనుగ్రహం (24-02-2017) - Sakshi


శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం,

శిశిర ఋతువు మాఘ మాసం,

తిథి బ.త్రయోదశి రా.8.57 వరకు,

నక్షత్రం శ్రవణం పూర్తి

వర్జ్యం ఉ.10.01 నుంచి 11.44 వరకు,

దుర్ముహూర్తం ఉ.8.34 నుంచి 9.24 వరకు,

తదుపరి ప.12.32 నుంచి 1.22 వరకు

అమృతఘడియలు రా.8.02 నుంచి 9.55 వరకు,

మహాశివరాత్రి





సూర్యోదయం      :    6.25

సూర్యాస్తమయం  :    6.08

రాహుకాలం       :  ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం      :  ప.3.00 నుంచి  4.30 వరకు



భవిష్యం

మేషం: మీ ప్రయత్నాలకు మిత్రుల చేయూత నిస్తారు. ధనలబ్ధి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆహ్వానాలు రాగలవు. వాహనసౌఖ్యం. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగులకు పదోన్నతి.



వృషభం: బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అదనపు ఖర్చులు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.



మిథునం: ప్రతి పనిలోనూ జాప్యం. బంధువులతో అకారణ వైరం. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు అధికం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.



కర్కాటకం: సంఘంలో పలుకుబడి. ఆర్ధికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.



సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. స్నేహితుల సహాయం లభిస్తుంది. దైవచింతన. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.



కన్య: కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. శ్రమా«ధికంతో పనులు పూర్తి. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారులకు నిరాశ తప్పదు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.



తుల: కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యభంగం. నిర్ణయాలలో నిదానం అవసరం. ఆకస్మిక  ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.



వృశ్చికం: అనుకోని ధనలాభం. ఉద్యోగయోగం. అప్రయత్న కార్యసిద్ధి. దేవాలయాల సందర్శనం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు.



ధనుస్సు: వ్యయప్రయాసల కోర్చి పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.



మకరం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో విశేష గౌరవం. భూ, గృహయోగాలు. సన్నిహితు లతో వివాదాలు పరిష్కారం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.



కుంభం: ధనవ్యయం. స్నేహితులతో విభేదాలు. పనుల్లో తొందరపాటు. పెట్టుబడుల్లో తొందరవద్దు. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.



మీనం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని మొండి బాకీలు వసూలు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో నిర్ణయాలు. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిని ఇస్తాయి.

– సింహంభట్ల సుబ్బారావు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top