హోదాపై జగన్ చేస్తున్న పోరాటం అభినందనీయం

YSRCP Kuwait SC ST Department Support to YS Jagan for Special Status - Sakshi

కువైట్: ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటు ఎంతో బిజీగా ఉన్న ప్రత్యేక హోదాపై జననేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం తీరు అభినందనీయం. మాలియా ప్రాంతములో వైఎస్‌ఆర్‌​ కాంగ్రెస్ పార్టీ కువైట్ ఎస్సి, ఎస్టీ, విభాగం ఇంచార్జ్‌ బీఎన్ సింహ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఆంధ్రుల హాక్కు అనే నినాదంతో ప్లే కార్డులు పట్టి కమిటీ సభ్యులు ప్రవాసాంధ్రులు రాష్ట్ర ప్రభుత్వంపై తమ నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా గల్ఫ్, కువైట్, కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్ధం కొరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని చెప్పారు. ముఖ్యమంత్రి పిట్టలదొర మాదిరి ప్రగల్భాలు పలకడమే గాని రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమన్నారు. 

వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో బిజీగా ఉన్న ప్రత్యేక హోదాపై పోరాడుతున్న తీరు హార్షణీయమని అభినందనీయమని తెలుపుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే..అందరికి సంక్షేమ పధకాలు అందాలంటే 2019 లో జగన్ మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి కావలసిన ఆవశ్యకత అవసరం ఎంతో ఉందన్నారు. అందుకు ప్రతి ప్రవాసాంధ్రుడు 2019 లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలనీ అభ్యర్ధించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ ఎస్సి, ఎస్టీ, విభాగం ఇంచార్జ్‌ బీఎన్ సింహ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి మహా నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కొరకు ఏర్పడిన పార్టీ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అన్ని కులాలకు మతాలకు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉన్నది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక హోదా కొరకు జరిగే ప్రతి కార్యక్రమములో ప్రజలు స్వచ్చందంగా పాల్గోని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పత్రిక ముఖంగా ప్రజలకు మనవి చేశారు. 

కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటులో తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టి చీకటిలోకి తోశారు. ఈ కారు చీకటి పోవాలి అంటే ప్రత్యేక హోదా ఒక్కటే అని గల్ఫ్ ప్రవాసాంధ్రులు  నమ్మకం. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజలలో సజీవంగా ఉన్నది అంటే అది మా నాయకుడు జగనమోహన్ రెడ్డి పోరాటం వలనే అని మేము గర్వంగా చెప్పగలమన్నారు. ప్రత్యేక హోదావలన ఏమి లాభం లేదు.. ప్యాకేజి నే ముద్దు అన్న బాబు ఎన్నికలు సమీపించడంతో యు టర్న్ తీసుకోని మరల ప్రత్యేక హోదా కావాలి అంటూ మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించడానికి కుటిల ప్రయత్నం చేస్తున్నారు. 

గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు రహిమాన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాష్ట్ర ప్రజలు మెజార్టీ లోక్ సభ సభ్యులను గెలిపించి డిల్లీకి పంపితే తప్పక మనకు నాయ్యం జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుంది కావున గల్ఫ్ దేశాలకు వచ్చి ఇబ్బందులు పడకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు దొరుకుతాయి అనే భావన వ్యాక్తం చేశారు. 

సలహాదారుడు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పిడుగు సుబ్బారెడ్డి, ప్రముఖ ఉర్దూ కవి సయీద్ నజర్,  పలువురు వక్తలు ప్రత్యేక హోదా ప్రాముఖ్యత గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమములో లలిత రాజు, తెట్టు రఫీ, యువజన విభాగం లీడర్ మర్రి కళ్యాణ్, జిలేబి బాష, కంచర్ల నాగ సుబ్బారెడ్డి, షేక్ రఫీఖ్ ఖాన్, షేక్ రహమతుల్లా, షేఖ్ సబ్దర్, కే ఈశ్వర్ రెడ్డి, హరినాథ్ చౌదరి, రవిశంకర్, మల్లి, జగన్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు జబీవుల్లా, జగన్ సైన్యం అధ్యక్షుడు బాషా, భారీగా అభిమానులు పాల్గోన్నారు,
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top