రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మార్పుకోరుకుంటున్నారు : వల్లూరు రమేష్‌ రెడ్డి

Valluru Ramesh Reddy Comments On 2019 Andhra Pradesh Elections Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏప్రిల్‌ 11న జరిగిన పోలింగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మార్పుకు పట్టం కట్టేందుకు సిద్దమయ్యారని వైఎస్సార్‌సీపీ సలహాదారు, గవర్నింగ్ కౌన్సిల్ (యూఎస్‌ఏ) వల్లూరు రమేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలంతా ఓటింగ్‌కు తరలివచ్చారని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మార్పుకోరుకుంటున్నారని, ఏపీలో ‘ఫ్యాన్‌’ ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు ఎన్‌ఆర్‌ఐలు అందరూ కలిసి ఒక వింగ్‌గా ఏర్పడి ‘రావాలి జగన్‌ కావాలి జగన్‌’ అనే నినాదంతో వైఎస్‌ జగన్‌కు మద్దతుగా నిలవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ అభిమానులు, ప్రవాసాంధ్రులకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించినందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ బృందానికి అభినందనలు తెలిపారు. రెండేళ్లపాటు ‘ఐ–ప్యాక్‌’ బృందం చాలా కష్టపడి పనిచేసిందని, బృందం సభ్యులంతా చాలా క్రియాశీలంగా వ్యవహరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top