ఎస్‌టీఎస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Singapore Telugu Samajam conducts blood donation camp in Singapore - Sakshi

సింగపూర్‌ : సామాజికసేవా కార్యక్రమాల్లో భాగంగా సింగపూర్ తెలుగు సమాజం(ఎస్‌టీఎస్‌), రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఎన్నో సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న రక్తదాన కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న దాదాపు 50 మంది తెలుగు వారితో పాటు, ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్త దానం చేశారు. 

సోమ రవి ఆధ్వర్యంలో సభ్యులు కాశి, ప్రసాద్, సమ్మయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రక్త దానం శిబిరం నిర్వహించిన కార్యవర్గ సభ్యులకు, పాల్గొన్న దాతలకు సింగపూర్‌ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి కృతజ్ఞలు తెలిపారు. ఇలాంటి సమాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top