చికాగోలో 'హెల్త్‌ ఫెయిర్‌' విజయవంతం

Public Community Health Fair Was Conducted In CHICAGO, ILLINOIS - Sakshi

చికాగొ : గ్రేటర్‌ చికాగోలోని శ్రీ బాలాజీ టెంపుల్‌లో ఆగస్టు 3న పబ్లిక్‌ కమ్యూనిటీ హెల్త్‌ ఫెయిర్‌ను నిర్వహించారు. ఈ హెల్త్‌ ఫెయిర్‌ కార్యక్రమానికి డాక్టర్‌ వసంతనాయుడు, డాక్టర్‌ రాధికా పతి అధ్యక్షత వహించారు. హెల్త్‌ ఫెయిర్‌లో భాగంగా గుడికి వచ్చిన భక్తులకు, చుట్టుపక్కల నివసించే వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 400 మందికి పైగా హాజరైన ఈ హెల్త్‌ ఫెయిర్‌లో రక్తపోటు, ఇతర వైద్య పరీక్షలను నిర్వహించారు.ఈ హెల్త్‌ ఫెయిర్‌కు చికాగో ఆంధ్ర అసోసియేషన్‌, చికాగో తమిళ సంఘం, చికాగో తెలుగు అసోసియేషన్‌, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ చికాగో, శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమ్‌ ట్రస్ట్‌ స్పాన్సర్స్‌గా వ్యవహరించారు. పరీక్షలను నిర్వహించడానికి కావలసిన ల్యాబ్‌ వసతులను యునిల్యాబ్‌కి చెందిన శివరాజన్‌ అందజేశారు. 

మొత్తం 20మందికి పైగా  వైద్య నిపుణులు ఉచిత హెల్త్‌ ఫెయిర్‌ కార్యక్రమంలో పాల్గొని పరీక్షలు నిర్వహించారు. హెల్త్‌ ఫెయిర్‌లో పాల్గొన్న వైద్య నిపుణులు వరుసగా.. శోభ చొక్కలింగం(కార్డియాజిస్ట్‌), సురేఖ సాకల, శాంతి యెన్న(డెంటల్‌), మల్లిక రాజేంద్రన్‌ (గైనకాలజిస్ట్‌), గిరిజా కుమార్‌, రామరాజు యేలవర్తి(ఇంటర్నల్‌ మెడిసిన్‌), రమేశ్‌ కోలా (హెమటాలజిస్ట్‌), వసంతనాయుడు, కాంచన రాజశేఖర్‌, తనూజ కొత్తింటి, ఉషా అప్పలనేని (పిడియాట్రిషియన్స్‌), వైదేహి సలాడి (ఫిజియో థెరపిస్ట్‌), శ్రీ గురుస్వామి (సోషల్‌ వర్కర్‌), శ్రీ శక్తి రామనాథన్‌( డైటిషీయన్‌),  మధ్వాని పట్వర్ధన్‌ (క్లినికల్‌ సైకాలజిస్ట్‌), భార్గవి నెట్టెమ్‌, కృష్ణ బత్తిన (ఫ్యామిలి నిపుణులు), కృతిబెన్‌ అగేరా(యోగా), సంజీవని ( మానసిక రుగ్మతల నిపుణురాలు) ఉన్నారు. వీరు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఫెయిర్‌లో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించి  సలహాలు ఇచ్చారు. 

ఇక కార్యక్రమం చివర్లో రాధిక పతి మాట్లాడుతూ.. ఈ హెల్త్‌ ఫెయిర్‌ను విజయవంతం చేసినందుకు టెంపుల్‌ నిర్వాహకులను, పరీక్షలు నిర్వహించిన వివిధ వైద్య నిపుణులను, స్పాన్సర్లను, వాలంటీర్లను అభినందించారు. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి కారణమైన బాలాజీ టెంపుల్‌కు చెందిన మేనేజర్‌లు రమేశ చిత్తూరి, సత్య కుమారి, నిర్వాహకులు డా. ఎన్‌ఎస్‌ రావు, విజయలక్ష్మీరావు, వరదీశ్‌ చిన్నికృష్ణన్‌, అను అగ్నిహోత్రి, గణేశ్‌ సోలయిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top