డల్లాస్‌లో నాట్స్ గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్

NATS Sambaralu 2019 kick off event held in Dallas - Sakshi

డల్లాస్‌ : అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలు ఈసారి ఇర్వింగ్ వేదికగా జరగనున్నాయి. దీనికి సన్నాహకంగా ఇర్వింగ్‌లో నాట్స్ గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ నిర్వహించింది. అమెరికాలోని వివిధ నగరాల నుంచి నాట్స్ నాయకులందరు ఈ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. మే 24, 25, 26 తేదీల్లో జరిగే తెలుగు సంబరాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు కార్యాచరణ ప్రణాళికపై నాట్స్ నాయకత్వం చర్చించింది. ఈ గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు డల్లాస్‌ పరిసర ప్రాంతాల తెలుగు ప్రజలు దాదాపుగా వెయ్యి మందికి పైగా వచ్చారు. ఇర్వింగ్ వేదికగా జరిగే అమెరికా తెలుగు సంబరాలు అంబరాన్నేంటేలా జరిపేందుకు తమ సహాయ సహకారాలు అందిస్తామని డల్లాస్‌లో ఉండే తెలుగువారు ఈ సందర్భంగా తెలిపారు.

నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ లను నాట్స్ వైస్ చైర్మన్  శ్రీధర్ అప్పసాని, నాట్స్ కార్యవర్గ సభ్యులను నాట్స్ ఉపాధ్యక్షుడు బాపు నూతి సభకు పరిచయం చేశారు. అమెరికా తెలుగు సంబరాలు చైర్మన్ కిషోర్ కంచర్ల, సెక్రటరీ రాజేంద్ర మాదాల ఈ సందర్భంగా సంబరాల కార్యవర్గాన్ని ప్రకటించారు. తెలుగువారు అధికంగా ఉండే డల్లాస్‌లో తెలుగు సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, ఈ సంబరాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరం కృషి చేద్దామని నాట్స్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి పిలుపునిచ్చారు. స్థానిక తెలుగు ప్రజల తోడ్పాటుతో నాట్స్ తెలుగు సంబరాలను దిగ్విజయం చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని సంబరాల సమన్వయ కర్త కిషోర్ కంచర్ల అన్నారు.  
 

ఈ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు మన్నవ మోహనకృష్ణ, గంగాధర్ దేసు, నాట్స్ మాజీ ఛైర్మన్ లు శ్రీనివాస్ మద్దాలి, డా.మధు కొర్రపాటితో పాటుగా బోర్డు అఫ్ డైరెక్టర్స్, ఇతర కార్య నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర జాతీయ సంస్థల ప్రతినిధులు, స్థానిక సంస్థల సభ్యులు పాల్గొని, అమెరికా తెలుగు సంబరాలకు తమ వంతు సహాయ, సహకారాలను అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్‌గా వ్యవహరించిన కిషోర్ వీరగంధం వందన సమర్పణతో ఘనంగా నాట్స్ సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ ముగిసింది. ఈ ఈవెంట్ కు తమ సహకారాన్ని అందించిన నాట్స్ డల్లాస్ టీం సభ్యులు భాను లంక, అశోక్ గుత్తా, మురళి కొండేపాటి, కృష్ణ కొరడా, నాగిరెడ్డి మండల, తేజ వేసంగి, వెంకట్ పోలినేడి, రాజేంద్ర యనమదల, శ్రీధర్ విన్నమూరి, సురేంద్ర ధూళిపాళ్ల, ప్రసాద్ దస్తి, హరి, మోహన్ మెలిపెద్ది, రాజేష్ అల్లం, కిరణ్ మై కొండా, సృజన కడియాల మరియు ఈ కార్యక్రమానికి ఎమ్‌సీలుగా వ్యవహరించిన రాజేశ్వరి ఉదయగిరి, అను అడుసుమల్లిలకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top