నాట్స్ ఆధ్వర్యంలో యోగా శిబిరం

NATS Community Yoga event held by Florida  - Sakshi

ఫ్లోరిడా(టెంపా) : శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా ఉత్తమమైన మార్గమని యావత్ ప్రపంచానికి  భారత్ చాటింది. అంతర్జాతయ యోగా దినోత్సవంతో ఇప్పుడు యోగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. అమెరికాలో తెలుగు వారు కూడా  యోగాపై ఇప్పుడు మరింత మక్కువ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్), ఇషా పౌండేషన్‌తో కలిసి టెంపాలో యోగా శిబిరాన్ని ఏర్పాటుచేసింది.

యోగా చేయడం వల్ల కలిగే ఉపయోగాను వివరించి, యోగాసనాలు, ధ్యానం నేర్పించారు. స్థానిక తెలుగువారు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎంతో సులభమైన ఆసనాల ద్వారా మనస్సును ఎంత ప్రశాంతంగా ఉంచుకోవచ్చనేది ఈ శిబిరంలో నేర్పించారు. నాట్స్ టెంపా చాప్టర్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని స్థానిక తెలుగువారు అభిలాషించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top