ఆఫ్ఘన్‌ నేలపై మా బూట్లు అడుగుపెట్టవు!

US defense secretary Jim Mattis met Prime Minister Narendra Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌కు భారత సైన్యాన్ని పంపించే ప్రసక్తే లేదని రక్షణశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ స్పష్టంచేశారు. భారత్‌ పర్యటనలో ఉన్న అమెరికా రక్షణమంత్రి జిమ్‌ మాటిస్‌తో భేటీ అయిన సందర్బంగా ఆమె ఈ విషయాన్ని చెప్పారు. ఢిల్లీలో భేటీ అయిన ఇరుదేశాల రక్షణమంత్రులు.. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణబంధం బలోపేతంతోపాటు సీమాంతర ఉగ్రవాదంపై ప్రధానంగా చర్చించారు. ఆప్ఘన్‌కు తమ సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. భారత్‌, అమెరికా రెండూ ఉగ్రబాధిత దేశాలేనని గుర్తుచేసిన నిర్మలా సీతారామన్‌.. టెర్రరిజంపై ఉక్కుపాదం మోపాలని మాటిస్‌ను కోరారు.

భారత్‌లో పర్యటిస్తోన్న అమెరికా రక్షణమంత్రి జిమ్ మాటిస్‌.. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ముఖ్యంగా రక్షణరంగ సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. అమెరికాకు భారత్‌ కీలక రక్షణ భాగస్వామి అని ఈ సందర్భంగా మాటిస్‌ వ్యాఖ్యానించారు.  ఉగ్రవాదంపై పోరు, ఆఫ్ఘనిస్తాన్‌కు సహకారంపై మోదీ- మాటిస్‌ చర్చించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top