ఒక్క క్లిక్‌తో నేటి ప్రధాన వార్తలు

Today News Roundup 7th July 2018 - Sakshi

సాక్షి, రామచంద్రాపురం (తూర్పు గోదావరి) : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకున్నారంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు మరో ఆరు నెలల్లో ఉన్నాయనగా అయ్యయ్యో తెలుగుతల్లికి అన్యాయం జరిగిందా?. అయ్యయ్యో ప్రత్యేక హోదా రాలేదా? అని చంద్రబాబు మాట్లాడతారని దుయ్యబట్టారు. 

వినేవాడు అమాయకుడైతే.. చెప్పేవాడు చంద్రబాబు : వైఎస్‌ జగన్‌
సాక్షి, రామచంద్రాపురం (తూర్పు గోదావరి) : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకున్నారంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్‌ పార్టీ ‘బెయిలు బండి’ : మోదీ
జైపూర్‌: దేశంలోని కాంగ్రెస్‌ బడా నాయకులంతా కేసుల్లో ఇరుక్కొని బెయిలుపై బయట తిరుగుతున్నారనీ.. కాంగ్రెస్‌ పార్టీ ‘బెయిల్‌ గాడీ’ (బెయిల్‌ బండి) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

బొట్టు పెట్టుకొని మదర్సా వెళ్లిందని..!
తిరువనంతపురం : మత సంప్రదాయాలు, కట్టుబాట్లు మంటగలిపిందనే కారణంగా ఐదో తరగతి విద్యార్థినిని మదర్సా నుంచి బహిష్కరించిన ఘటన ఉత్తర కేరళలో చోటుచేసుకుంది.

నీట్‌, జేఈఈలపై కేంద్రం సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో కీలక పరీక్షలుగా పేరొందిన నీట్‌, జేఈఈ, యూజీసీ నెట్‌, సీమ్యాట్‌లను ఇకపై ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ శనివారం ప్రకటించారు.

అరుంధతీ నక్షత్రం చూస్తూ కుప్పకూలిన వధువు!
సాక్షి, నాగర్‌కర్నూల్‌ : పెళ్లి సందడిలో మునిగి తేలుతున్న కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ఊహించని షాక్‌ తగిలింది. 

ప్లాస్టిక్‌ వస్తువులలో ఆహారం తింటున్నారా.. జాగ్రత్త
న్యూయార్క్‌ : ప్లాస్టిక్‌ వాడకం వల్ల పర్యావరణానికే కాదు మనుషుల ప్రాణాలకు కూడా ముప్పేనట

కోర్టులో టేబులెక్కిన బాలుడు.. అయోమయంలో జడ్జి!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన పిల్లలు ఇమిగ్రేషన్‌ కోర్టు ముందుపడరాని పాట్లు పడుతున్నారు.

షేర్ల జోరు : బఫెట్‌ను దాటేసిన జుకర్‌బర్గ్‌
శాన్‌ఫ్రాన్సిస్కో : ఓ వైపు కేంబ్రిడ్జ్‌ అనలిటికా డేటా స్కాండల్‌, మరోవైపు యూజర్ల ప్రైవసీపై ఆందోళనలు ఫేస్‌బుక్‌ను తీవ్ర ఇరకాటంలో పడేసినప్పటికీ, ఆ కంపెనీ మాత్రం ఏ మాత్రం జంగకుండా శరవేగంగా దూసుకుపోయింది.

హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్‌ ‘అపరిమిత’ డేటా
న్యూఢిల్లీ : టెలికాం రంగంలో మరో బిగ్గెస్ట్‌ గేమ్‌ ఛేంజర్‌గా రిలయన్స్‌ జియో తన ఫైబర్‌ ఆప్టికల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు ‘జియోగిగాఫైబర్‌’ ను గత రెండు రోజుల క్రితమే లాంచ్‌చేసిన సంగతి తెలిసిందే

ధోని బర్త్‌డే : అనుష్కశర్మపై ట్రోల్‌
హైదరాబాద్‌: టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని బర్త్‌డే సందర్భంగా ఓ వైపు అతనికి సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ పోటెత్తుతుంటే.

లేట్‌నైట్‌లో హీరోహీరోయిన్లు.. ఫోటోలు హల్‌చల్‌
అర్ధరాత్రి హీరోహీరోయిన్లు ముచ్చటించుకుంటున్న ఫోటోలు హాట్‌ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్‌ యూత్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌, హీరోయిన్‌ అలియాభట్‌లు కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

కత్రినాను ఏడిపిస్తోన్న అర్జున్‌ కపూర్‌!
ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్‌ ఫాంలో ఉన్న స్టార్ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌. ఒకప్పుడు ఐరన్‌ లెగ్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ తరువాత వరుస విజయాలతో సత్తా చాటారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top