ఒక్క క్లిక్‌తో నేటి ప్రధాన వార్తలు

Today News Roundup 4th July 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎంపీల భాష జుగుప్సాకరంగా ఉందంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జేసీ దివాకర్‌ రెడ్డి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని తీవ్ర స్థాయిలో గర్హించారు. ఇలాంటి నాయకుల వల్లే మిగిలిన వారికి చెడ్డపేరు వస్తుందని అభిప్రాయపడ్డారు.

జేసీ మనిషా? పశువా? : బొత్స
సాక్షి, హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎంపీల భాష జుగుప్సాకరంగా ఉందంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

రిప్లై ఇవ్వకపోతే పరువు నష్టం దావా వేస్తా
అమరావతి: తనను దూషించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులకు నోటీసులు పంపానని, రిప్లై ఇవ్వకపోతే పరువు నష్టం దావా వేస్తానని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చెప్పారు.

కర్ణాటక కాంగ్రెస్‌లో కీలక మార్పు
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కర్ణాటక పార్టీని పునర్వ్యవస్థీకరించారు. పార్టీ రాష్ట్రస్థాయి పదవుల్లో పలు మార్పులు చేపట్టారు.

వరంగల్‌ విషాదానికి కారణం ఇదే!
సాక్షి, వరంగల్‌ (అర్బన్‌): భద్రకాళీ ఫైర్‌వర్క్స్‌లో పేలుడు ప్రమాదం జరిగి 10 మంది కార్మికులు దు​ర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కన్నాపై చెప్పుల దాడి
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి జరిగింది.

ఇంట్లో ప్రియుడితో భార్యను చూసి.. నిప్పటించిన భర్త!
సాక్షి, నెల్లూరు : భార్య తనను మోసం చేసి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం ఆ వ్యక్తి సహించలేకపోయాడు.

ఫేక్‌ న్యూస్‌పై రీసెర్చ్‌ : రూ.34 లక్షలు పొందండి
న్యూఢిల్లీ : నకిలీ వార్తల విషయంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక విమానాల్లో హిందూ భోజనం కట్‌
దుబాయ్‌ : దుబాయ్‌ అధికారిక విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ తన అధికారిక మెనూ నుంచి ‘హిందూ మీల్స్‌’ ఆప్షన్‌ను తొలగించింది.

ఆ విషయంలో నో కాంప్రమైజ్‌: రవిశాస్త్రి
హైదరాబాద్ : ఆటగాళ్ల సమయపాలన విషయంలో తాను ఎప్పటికి కాంప్రమైజ్‌ కానని టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి తెలిపారు.

వైరల్‌: రాహుల్‌ సెలబ్రేషన్‌.. ధోని రియాక్షన్‌
మాంచెస్టర్‌ : ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే.

ట్రైలర్‌కు బదులుగా ఫుల్‌ మూవీ అప్‌లోడ్‌..
సాధారణంగా సినిమా విడుదలకు ముందు ట్రైలర్లు, టీజర్లు లాంటివి ప్రమోట్‌ చేయడం చూస్తుంటాం. అయితే సోని పిక్చర్స్‌ వారు చేసిన పనికి ఏకంగా నెటిజన్లు మొత్తం సినిమానే హాయిగా వీక్షించారు.

మరోసారి తెరమీదకు మెగా మల్టీస్టారర్‌.!
మెగా స్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ల కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌ సినిమాను తెరకెక్కించేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top