ఒక్క క్లిక్‌తో నేటి ప్రధాన వార్తలు

Today News Roundup 3rd July 2018 - Sakshi

‘జేసీ బ్రదర్స్‌ మమ్మల్ని చంపేస్తారేమో!’
సాక్షి, అనంతపురం : టీడీపీకి గుడ్‌బై చెప్పిన తాడిపత్రి నేతలు జగ్గీ బ్రదర్స్‌(బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలు) మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్‌ నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారంటున్నారు. ‘తాడిపత్రిలో అరాచకం రాజ్యమేలుతోంది. జేసీ బ్రదర్స్‌ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. 

ఎంఐఎం ఆగడాలను అడ్డుకుంటుంది బీజేపీనే
సాక్షి, ధర్మపురి : పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వళ్లించినట్టుగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ విమర్శించారు.

విశ్వనట చక్రవర్తికి వైఎస్‌ జగన్‌ నివాళి
సాక్షి, రామచంద్రాపురం: తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అజరామర పాత్రల్లో అలరించిన మహానటుడు, విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు.

రైతులతో కలసి ఆందోళనకు దిగిన అవినాశ్‌ రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌ : పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్‌ బకాయిల చెల్లింపులో జాప్యంపై వైఎస్సార్‌ కాంగ్సెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాలిక కరుచుకున్న నాగం
హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అవినీతే రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి  అని వ్యాఖ్యానించి కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డి నాలిక కరుచుకున్నారు.

‘పవన్‌ పోటీచేసినా నేనే గెలుస్తా’
సాక్షి, ఏలూరు/పశ్చిమ గోదావరి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
గోరక్షకులకు సుప్రీం వార్నింగ్‌
న్యూఢిల్లీ : గోరక్షణ పేరిట చట్టాన్ని ఎవరు చేతులోకి తీసుకోవద్దని మంగళవారం సుప్రీం కోర్టు మరోసారి హెచ్చరించింది. 
 

కొత్త గ్రహం పుట్టింది..!!
బెర్లిన్ : అప్పుడే జన్మించిన కొత్త గ్రహా ఫొటోను యూరోపియన్‌ సదర్న్‌ అడ్జర్వేటరీ విడుదల చేసింది. 

నేడు కేరళలో పర్యటించనున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు
తిరువనంతపురం : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తన పర్యటనను ముమ్మరం చేశారు.

కన్నకొడుకును కాల్చిచంపాడు..
జైపూర్‌ : రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలో వరసకు సోదరి అయ్యే బాలికపై లైంగిక దాడికి యత్నించిన 17 ఏళ్ల కుమారుడిని హత్య చేసినందుకు 40 ఏళ్ల వ్యక్తిని, అతడి పెద్ద కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వివాదంలో ‘సత్యమేవ జయతే’
బాలీవుడ్ నటులు జాన్‌ అబ్రహం, మనోజ్‌ బాజ్‌పాయ్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ సత్యమేవ జయతే.

‘గంభీర్‌కు మళ్లీ కీలక బాధ్యతలు’
న్యూఢిల్లీ: భారత వెటరన్‌ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో మళ్లీ కీలకం కానున్నాడు.

చిదంబరానికి మరోసారి ఊరట
సాక్షి,న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత పి.చిదంబరానికి మరోసారి ఊరట లభించింది

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top