నేటి ముఖ్యాంశాలు

Today News Roundup 24th July - Sakshi

​​​ఏపీ బంద్‌ సక్సెస్‌!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌ విజయవంతమైంది. 

కారెక్కే వార్తలపై క్లారిటీ ఇచ్చిన ముఖేష్‌
హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ కారెక్కడానికి సిద్ధంగా ఉన్నట్టు వస్తున్న వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

‘బంద్‌ను ప్రభుత్వం అణచివేయాలని చూసింది’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బంద్‌పై టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన వైఖరిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
 

‘రాహుల్‌కు తెలివిలేదు’
లక్నో : లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాహుల్‌ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీని ఆలింగనం చేసుకున్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 
 

పొత్తుపై మాయావతి యూటర్న్‌..!?
లక్నో : మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీలు పొత్తుకు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. 
 

తాజ్‌ పరిరక్షణకు విజన్‌ డాక్యుమెంట్‌
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక ప్రాచీన కట్టడం తాజ్‌ మహల్‌ పరిరక్షణకు యూపీ ప్రభుత్వం పలు ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. 

40 ఏళ్లుగా సహించాం.. ఇక చాలు!
టెహ్రాన్‌ : అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌ దేశాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. 

ఆందోళనలో చంద్రబాబు: సురవరం
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్‌లో పాల్గొంటున్న ఆ పార్టీ శ్రేణులను టీడీపీ ప్రభుత్వం పోలీసుల చేత అరెస్ట్‌ చేయించడాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి తప్పుపట్టారు.

కవిత చాలెంజ్‌ స్వీకరించిన రాజమౌళి
ఇటీవల ఫిట్‌నెస్‌చాలెంజ్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. రాజకీయ నాయకులతో పాటు సినీతారలు కూడా ఈ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ను స్వీకరించి తమ వర్క్‌ అవుట్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లింను చితకబాదారు..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకునేందుకు రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు చేరుకున్న ఓ ముస్లిం యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కనికరం లేకుండా దాడి చేశారు. 

ప్రభాస్‌ ప్రేమకథ మొదలవుతోంది
యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే నెక్ట్స్‌ సినిమాను రెడీ చేస్తున్నాడు ప్రభాస్‌. 

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ తర్వాత..
లండన్‌ : ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ కౌంటీ చాంపియన్‌షిప్‌లో టీమిండియా స్పిన్నర్ ర‌విచంద్ర‌న్‌ అశ్విన్ మరోసారి బరిలో దిగనున్నాడు.
 

వాట్సాప్‌లో మీ ట్రైన్‌ స్టేటస్‌.. చెక్‌చేసుకోండిలా..
న్యూఢిల్లీ : మీరు ప్రయాణించాలనుకునే రైలు, ఎక్కడుంది..? ఇంకెంత సేపట్లో ప్లాట్‌ఫామ్‌ మీదకు వస్తుంది? అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ వాట్సాప్‌ తీసి ఓ మెసేజ్‌ చేసేయండి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top