10 సెకన్లలో​ క్యాన్సర్‌ను గుర్తించవచ్చు...

10 సెకన్లలో​ క్యాన్సర్‌ను గుర్తించే పెన్‌

న్యూయార్క్‌: క్యాన్సర్‌ చికిత్సలో కచ్చితత్వం పెరిగేలా ముందడుగు పడింది. సర్జరీ సమయంలో క్యాన్సర్‌ కణాన్ని గుర్తించే పెన్‌ వంటి పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరికరం కేవలం పది సెకన్లలోనే 96 శాతం నిక్కచ్చిగా ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో పోలిస్తే మాస్పెక్‌ పెన్‌గా పిలిచే ఈ పరికరం 150 రెట్లు వేగంగా పనిచేస్తుంది. క్యాన్సర్‌ కణుతులను తొలగించే క్రమంలో ఏ కణుతులను తొలగించాలి, వేటిని కాపాడాలనే విషయంలో సర్జన్లకు ఈ వినూత్న డిస్పోజబుల్‌ పరికరం మెరుగ్గా ఉపకరించనుంది. క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని నిరోధించి మెరుగైన చికిత్స అందించడంలో కూడా మాస్పెక్‌ పెన్‌ అందుబాటులోకి రానుంది. 

 

క్యాన్సర్‌ కణుతులను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ టెక్నాలజీ సర్జన్లకు బాగా ఉపకరిస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లివియా ఎబెర్లిన్‌ చెప్పారు. ఈ పెన్‌ను రోగి కణాలపై ఉంచినప్పుడు వాటిపై పరికరం నీటి బిందువును జారవిడుస్తుంది...ఈ శాంపిల్‌ను పరికరంలో ఉండే మాస్‌ స్పెక్ట్రోమీటర్‌ గ్రహిస్తుంది. సూక్ష్మాతిసూక్ష్మమైన అణువులను సైతం ఇది పరీక్షిస్తుంది.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top